తొలి వ్యక్తీ మీరే, ఆఖరి వ్యక్తీ మీరే
on May 31, 2017
'కధ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, నిర్మాత, దర్శకత్వం'.. "దాసరి నారాయణరావు" అనే Title Card ని వెండితెరకి పరిచయం చేసిన తొలి వ్యక్తీ మీరే, ఆఖరి వ్యక్తీ మీరే..
చిన్న కధ నుండీ పెద్ద కధ వరకూ, చిన్న బడ్జెట్ నుండీ భారీ బడ్జెట్ వరకూ, కొత్త నటుల నుండీ అనుభవజ్ఞుల వరకూ, చిన్న స్టార్స్ నుండీ పెద్ద స్టార్స్ వరకూ అందరికో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను వెండితెరకి పరిచయం చేసిన తొలి వ్యక్తీ మీరే, ఆఖరి వ్యక్తీ మీరే..
దర్శకుడంటే ఒకే రకం (రసం) కధా చిత్రాలకే పరిమితం కారాదు, అన్ని రకాల (నవరసాల) కధలను Deal చేయగలగాలి అని వెండితెరకి పలు విజయవంతమైన చిత్రాలను అందించిన తొలి వ్యక్తీ మీరే, ఆఖరి వ్యక్తీ మీరే..
'దర్శకత్వం' అంటే కేవలం Lights, Camera, Action & Cut అనే పదాలకే పరిమితమైపోకుండా.. నటుడిగా నటించి, 'దర్శకత్వం' Position కి Self Respect, Pride & Command అనే లక్షణాల్ని జోడించి, ఆ వృత్తికి ఒక Special Recognition & Heroism అనే Qualities ని కల్పించి, 'దర్శకుడు కూడా నటించగలడు' అని నిరూపిస్తూ పలు చిత్రాలను వెండితెరపై వెలిగించిన తొలి వ్యక్తీ మీరే, ఆఖరి వ్యక్తీ మీరే..
కధ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, నిర్మాత, దర్శకత్వం ఇత్యాది పనులతో పాటు పరిశ్రమలోని ప్రతివ్యక్తి సమస్యను తన సొంత సమస్యగా భావిస్తూ, తనదైన శైలిలో దానిని పరిష్కరించగలిగే శక్తి (L E A D E R) గా ఎదిగి, అందరి చేత భక్తి, శ్రద్ధలతో 'గురువు గారు' అని పిలిపించుకున్న తొలి వ్యక్తీ మీరే, ఆఖరి వ్యక్తీ మీరే..
'దర్శకుడు' అంటే కేవలం చిత్ర పరిశ్రమతోనే ఆగిపోనఖ్ఖర్లేదూ, రాజకీయాల్లోకీ వెళ్ళొచ్చూ, అని వెళ్ళి 'కేంద్ర మంత్రి' కూడా అయ్యి ప్రజాసేవ చెయ్యొచ్చూ అని తెలియజెప్పిన తొలి వ్యక్తీ మీరే, ఆఖరి వ్యక్తీ మీరే..
మీ దర్శకత్వంలో స్వర్గీయ 'నందమూరి తారక రామారావు' గారు నటించిన 'మనుషులంతా ఒక్కటే', 'సర్దార్ పాపారాయుడు', 'బొబ్బిలిపులి' చిత్రాలు, అన్నగారి వీరాభిమానులమైన మా గుండెల్లో, మీరు జరిపించిన 'దీపావళి' పండుగలు. మీ దగ్గర Assistant గా పని చేయకపోయినా, నన్ను మీ శిష్యుడిగా, సొంత మనిషిగా ఆదరించారు. మా 'బొమ్మరిల్లు వారి' సంస్థ నిర్మించిన ప్రతి Cinema Function కూ, మీరు Chief Guest గా రావటమే కాక, మా సంస్థకి మీ ఆశీస్సులు అందిస్తూ వచ్చారు..
150 చిత్రాలకు పైగా చిత్రాలను దర్శకత్వం వహించే శక్తిసామర్ధ్యాల్నిచ్చిన ఆ దేవుడు మీకు 100 ఏళ్ళ ఆయుష్షునివ్వకుండా 75 ఏళ్ళకే తన దగ్గరకి తీసుకెళ్ళిపోవటం వెనుక ఆయనకి ఎన్ని లెక్కలున్నా, ఇంతకు మించిన శక్తిసామర్ధ్యాలతో మిమ్మల్ని మళ్ళీ పుట్టించాలని మనస్పూర్తిగా ఆ దేవుడ్ని ప్రార్ధిస్తూ..
మీ శిష్యుడు,
వై వి ఎస్ చౌదరి.
Also Read