డిసెంబర్ లో రేయ్ పాటలు
on Nov 24, 2013
సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం "రేయ్". వైవియస్ చౌదరి దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్న ఈ చిత్రంలో సయామీ ఖేర్, శ్రద్ధాదాస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా విశేషాల గురించి దర్శకుడు మాట్లాడుతూ...రెండు దేశాల నేపధ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. తొలి సగభాగం వెస్టిండీస్ సంస్కృతీ, మలిభాగం అమెరికా నేపధ్యంలో ఉంటుంది. సాయిధరమ్ తేజ్ పాత్ర నేటి యువతకు అద్దం పట్టేలా ఉంటుంది. చక్రి అందించిన పాటలను వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేస్తామని అన్నారు.