ఆ దర్శకుడు దివాళా తీసేశాడు
on Feb 5, 2016
ఒక్క సినిమా చాలు.. జీవితాల్ని తలకిందులు చేయడానికి. అలాంటిది వైవిఎస్ చౌదరికి దెబ్బ మీద దెబ్బలు పడ్డాయి. ఒకటా రెండా? వరుస పరాజయాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి. చిన్న సినిమాలతో పెద్ద దర్శకుడిగా పేరు తెచ్చుకొన్న చౌదరికి ఈమధ్య కాలంలో ఊహించని భారీ పరాజయాలు వెన్నాడాయి. మరీ ముఖ్యంగా.. రేయ్ సినిమా ఆయన ఆశల్ని ఆవిరి చేసింది. ఓ కొత్త కుర్రాడితో రూ.30 కోట్లు పెట్టి, మూడేళ్లు సినిమా తీశారు.
ఆ సినిమాతో ఏకంగా రూ.20 కోట్ల నష్టాలు వాటిల్లాయి. వాటి నుంచి వైవిఎస్ ఇంకా తేరుకోలేదు. బ్యాంకుల నుంచి తెచ్చుకొన్న అప్పులు ఇప్పుడు చౌదరిని వెంటాడుతున్నాయి. రేయ్ కోసం ఉన్న ఆస్తుల్ని అమ్ముకొన్న చౌదరి.. ఇప్పుడు చేతిలో ఉన్న ఒక్క థియేటర్‌నీ వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గుడివాడలో చౌదరికి ఓ థియేటర్ ఉంది. అది కాస్త అప్పుల్లో ఉంది. వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాడు చౌదరి. దాంతో సదరు బ్యాంకు వాళ్లు ఆ థియేటర్‌ని సీజ్ చేసేశారు. దాంతో ఇప్పుడు ఈ దర్శకుడు టోటల్‌గా జీరో అయిపోయాడు. 'డబ్బులన్నీ సినిమాల ద్వారా సంపాదించుకొన్నదే. సినిమాలతోనే పోయింది. మళ్లీ సంపాదించుకొంటా' అని నమ్మకంగా చెబుతున్న చౌదరికి మళ్లీ మంచి రోజులు ఎప్పుడొస్తాయో??