రామ్ కు విలన్ గా జగపతి
on Apr 9, 2014
బాలయ్య "లెజెండ్" సినిమాలో విలన్ గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న జగపతి బాబు మరోసారి విలన్ గా కనిపించబోతున్నాడు. రామ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో "పండగ చేస్కో" అనే చిత్రం తెరకెక్కనున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం దర్శకుడు జగపతిని సంప్రదించి కథ వినిపించాడట. కథ నచ్చి వెంటనే జగపతి ఒప్పేసుకున్నాడని తెలిసింది. రామ్ సరసన హన్సిక నటిస్తుంది. యునైటెడ్ మూవీస్ బ్యానర్లో యువ నిర్మాత పరచూరి ప్రసాద్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ చివర్లో ప్రారంభం కానుంది. మరి ఈ సినిమా జగపతికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో త్వరలోనే తెలియనుంది.