రవితేజను వదిలేసిన నిప్పు
on Nov 25, 2013
రవితేజ హీరోగా "బలుపు" సినిమాతో రచయితగా మంచి పేరు తెచ్చుకున్న బాబీ దర్శకుడిగా ఓ చిత్రం తెరకెక్కనున్నది. అయితే ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు వైవియస్ చౌదరి నిర్మించనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడని తెలిసింది. రవి, చౌదరి లకు మంచి స్నేహమే ఉంది. ఇటీవలే వీళ్ళిద్దరూ కలిసి "నిప్పు" అనే చిత్రం తెరకెక్కించారు కూడా.ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో మరోసారి అలాంటి తప్పు చేయొద్దు అని అనుకున్నడేమో.. చౌదరి ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడు. మరి ప్రస్తుతం ఈ చిత్రాన్ని రాక్ లైన్ వెంకటేష్ అనే ప్రముఖ కన్నడ సంస్థ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.