బాలీవుడ్ లో ‘బాహుబలి’ హంగామా
on Jun 19, 2015
బాలీవుడ్ లో ‘బాహుబలి’ ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ప్రభాస్, రానా, తమన్నాలు బాలీవుడ్ లో ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్ లలో తెగ పాల్గొంటూ మరింత ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ‘బాహుబలి’ హిందీ వెర్షన్ కు సంబంధించిన ‘మమతా సే బరీ..’ అనే పాట ట్రైలర్ ను విడుదల చేసారు.
ఈ ట్రైలర్ చూస్తుంటే మతిపోతుంది. సినిమాపై అంచనాలు ఇప్పటికే తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ సాంగ్ ట్రైలర్ తో మరింత పెరిగిపోతున్నాయి. తెలుగు బాహుబలి ఆడియో వేడుకలో దర్శకుడు రాజమౌళి చెప్పినట్లుగా ఇందులో రమ్యకృష్ణ అద్భుతంగా నటించినట్లుగా అనిపిస్తుంది. శీవగామి పాత్రలో రమ్యకృష్ణ లుక్స్ సూపర్బ్. ఇక ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. సాంగ్ ట్రైలర్ చూస్తేనే ఇలా వుందంటే.. ఇక సినిమా ఎలా వుండబోతుందో త్వరలోనే తెలియనుంది.