శ్రీను వైట్లకు వరుణ్ ఝలక్ ఇచ్చాడా..?
on May 30, 2016
వరస ఫ్లాపుల్లో ఉన్న శ్రీను వైట్లకు మెగా హీరో వరుణ్ తేజ్ తో సినిమా రావడం అదృష్టమే. చరణ్ తో బ్రూస్లీ టైం లో కథ, కామెడీ అన్ని డిపార్ట్ మెంట్స్ లో వైట్ల గారిపై చాలా ఒత్తిడి ఉంది. అయితే వరుణ్ తో సినిమా అంటే అలాంటివేమీ ఉండవు, హాయిగా హిట్ కొడతాడు అని ఇండస్ట్రీ జనాలనుకున్నారు. అయితే లేటెస్ట్ గా వీళ్లిద్దరి సినిమా పోస్ట్ పోన్ అయిందనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. శేఖర్ కమ్ముల చెప్పిన ఎన్నారై స్టోరీ లైన్, వైట్ల స్టోరీ కంటే బాగుందని, అందుకు ముందు ఆ సినిమానే స్టార్ట్ చేయాలని వరుణ్ అనుకుంటున్నాడని పుకార్లు వస్తున్నాయి. లీన్ ప్యాచ్ లో ఉన్న వైట్లకు హిట్ చాలా అవసరం. ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ ట్రాక్ ఎక్కాలనుకున్నాడు. ఈ పుకారు నిజమైతే మాత్రం, ఆయన ఇబ్బందుల్లో పడ్డట్టే. మిస్టర్ అనే టైటిల్ కూడా కన్ఫామ్ చేసిన ఈ సినిమా ఎలాగైనా పట్టాలెక్కడం ఈ దర్శకుడికి అత్యావశ్యకం. మరో వైపు ఈ టాక్ పై శ్రీను వైట్ల అండ్ కో చాలా గుర్రుగా ఉన్నారు. తమపై కావాలనే బురద జల్లుతున్నారని ఫైర్ అవుతున్నారు వైట్ల. ప్రస్తుతం ఫారిన్ టూర్ లో ఉన్న వరుణ్ ఇండియాకు వచ్చాక ఈ పుకార్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.