బేరానికి శ్రీనువైట్ల ఇల్లు..
on Sep 12, 2016
కామెడి మెయిన్ ఎలిమెంట్‌గా సినిమాలు తీస్తూ..ఇంటిల్లిపాదిని కడుపుబ్బా నవ్వించే ఈతరం దర్శకుల్లో శ్రీనువైట్ల ముందుంటారు. ఎంతపెద్ద స్టార్ హీరో ఉన్నా..ఈయన సినిమాల్లో కామెడీనే అసలు హీరో. అందుకే శ్రీను సినిమాలకు అంత గీరాకీ. కామెడీ సినిమాలే కాకుండా స్టార్ హీరోలను సైతం డైరెక్ట్ చేసి వారికి సూపర్‌హిట్లు అందించాడు శ్రీను. మంచు విష్ణుకి "ఢీ", మహేశ్‌కి "దూకుడు", ఎన్టీఆర్‌కి "బాద్‌షా" వంటి బ్లాక్‌బస్టర్లు ఇచ్చి టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరిగా ప్లేస్ కొట్టేశాడు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. మహేశ్‌తో తీసిన "ఆగడు" శ్రీను వైభవాన్ని మసకబార్చింది. తీసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవ్వడంతో పాటు పర్సనల్‌గానూ గొడవలు ఎక్కువయ్యాయి. బ్రూస్‌లీ సినిమా డిజాస్టర్, ఆ వెంటనే భార్యతో విబేధాలు, పోలీస్ కేస్ ఇవన్నీ శ్రీనుని క్రుంగదీశాయి. అయితే లేటేస్ట్ న్యూస్ ప్రకారం అతను తన ఇల్లు బేరానికి పెట్టినట్లు ఫిలింనగర్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. అప్పులు ఇంకా తీరలేదని కొంతమంది..కాదు ఆ ఇల్లు వాస్తు బాగోలేదని అందుకు అమ్మకానికి పెట్టాడని రకరకాలుగా చెవులు కొరుక్కుంటున్నారు. కాని ఇల్లు అమ్మడానికి అసలు కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.