వైట్ల వరుణ్ సినిమా ఇక లేనట్టేనా..?
on Jun 8, 2016
శ్రీను వైట్ల వరుణ్ తేజ మిస్టర్ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా ఈ న్యూస్ ను కన్ఫామ్ చేస్తున్నారు ఫిలింనగర్ జనాలు. మిస్టర్ సినిమాకు కథ సెట్ అవ్వలేదని వరుణ్ భావించాడని, అందుకే ముందు శేఖర్ కమ్ముల సినిమాను మొదలెట్టబోతున్నాడని అంటున్నారు. పైపెచ్చు శేఖర్ కమ్ముల మూవీ కోసం యాక్టర్స్ కు జూలై 18 నుంచి షూటింగ్ అంటూ డేట్స్ తీసుకున్నారట. మరి వైట్ల తో షూటింగ్ ఉంటే, ఈ సినిమాకు షూటింగ్ డేట్స్ ఎలా ఇస్తారు. వైట్ల సినిమా ఆగిపోయినట్టేనా..? లేక రెండు సినిమాలకు వరుణ్ ఒకేసారి షూటింగ్ చేయబోతున్నాడా..? ఇవీ ఇప్పుడు సినీజనాల ముందున్న ప్రశ్నలు. దీనిపై వరుణ్, శ్రీను వైట్ల క్లారిటీ ఇస్తే తప్ప రూమర్స్ కు చెక్ పడేట్టు కనిపించడం లేదు.