శ్రీనువైట్లకు ఇల్లు కూడా మిగల్లేదా..?
on Apr 20, 2017
టాలీవుడ్ ఇప్పుడు బ్యాడ్ టైం పీక్స్‌లో ఉన్నది ఎవరికి అంటే డైరెక్టర్ శ్రీను వైట్ల అని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. వరుసగా రెండు సినిమాలు డిజాస్టర్స్ కావడంతో ఇండస్ట్రీలో చావో రేవో తేల్చుకోవాల్సిన దశలో ఆశలన్నీ మిస్టర్ మీదే పెట్టుకున్నాడు. కానీ కాలం కలిసిరాక మిస్టర్ కూడా మునిగిపోయింది. మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు ఇలాంటి పరిస్థితుల్లోనే శ్రీనుకి పెద్ద షాక్ తగిలింది.
‘మిస్టర్ హిట్టయితే ప్రాఫిట్‌లో షేర్ తీసుకుందామని అనుకున్నాడు .. దీనిలో భాగంగా ఈస్ట్, వైజాగ్, కృష్ణ ఏరియాల రైట్స్‌ను తన దగ్గర పెట్టుకున్నాడట శ్రీను. కానీ సినిమా బాక్సాఫీస్ ముందు బొక్కబొర్లాపడటంతో మేకర్స్ నుంచి ఒత్తిడి మొదలైంది. దీంతో కొంతమొత్తం ఇవ్వడానికి శ్రీనువైట్ల అంగీకరించాడని ఫిల్మ్‌నగర్ టాక్. ఇప్పటికే నిండా అప్పుల్లో మునిగిపోవడంతో చేసేది లేక హైదరాబాద్‌లో తనకు మిగిలిన ఇంటిని అమ్మేశాడట.. జర్నలిస్టు కాలనీలో వున్న తన ఫ్లాట్‌ను 15 కోట్ల రూపాయలకు అమ్మేసి కొంత మొత్తాన్ని నిర్మాతలకు ఇచ్చాడని సినీ జనాలు అంటున్నారు. ఇంత జరుగుతున్నా శ్రీను వైపు నుంచి ఎలాంటి స్పందనా లేదు. జరిగిన దానిలో వాస్తవమెంతో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.