వైట్ల గురించి వరుణ్ క్లారిటీ ఇచ్చేశాడు..!
on Jun 9, 2016
ఎట్టకేలకు వైట్ల వరుణ్ ప్రాజెక్ట్ గురించి ఒక క్లారిటీ వచ్చింది. వైట్లగారి సినిమా ఆగిపోయిందని, శేఖర్ కమ్ములతో వరుణ్ ప్రాజెక్ట్ ఓకే చేశాడని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఫిలింనగర్ లో చాలా పుకార్లు చక్కర్లు కొట్టాయి. అయితే వీటన్నిటికీ తన ట్వీట్ తో సమాధానమిచ్చాడు వరుణ్. సినిమా షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నాను. ఈ నెల 27 నుంచి స్పెయిన్లో, శ్రీను వైట్ల గారితో సినిమా స్టార్ట్ అవ్వబోతోంది అంటూ వరుణ్ చేసిన ట్వీట్ అన్ని అనుమానాలను క్లియర్ చేసేసింది.
ఇప్పటికే వరస ఫ్లాపులతో సతమతమవుతున్న శ్రీను వైట్లకు ఈ ప్రాజెక్ట్ చాలా కీలకం. ఈ సినిమాతో హిట్ కొడితేనే ఆయన కెరీర్ మళ్లీ ట్రాక్ ఎక్కుతుంది. అందుకే కెరీర్ మొదట్లో చేసి హిట్ కొట్టిన ఆనందం, సొంతం తరహా కాలేజీ లవ్ స్టోరీగా సినిమాగా దీన్ని తెరకెక్కిస్తున్నాడు. నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధులు నిర్మిస్తున్న ఈ సినిమాకు మిస్టర్ అనే టైటిల్ ను ప్రకటించారు. లోఫర్ లాంటి ఫ్లాప్ తర్వాత, వరుణ్ కు కూడా ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారింది.