శ్రీనువైట్ల 'అమ్మకం' వెనుక అసలు కారణం!
on Sep 13, 2016
ఫిల్మ్‌నగర్‌లోని శ్రీనువైట్ల ఇల్లు అమ్మకానికి వచ్చిందన్న న్యూస్... సినీ పరిశ్రమ అంతా పాకేసింది. ఏంటి?? శ్రీనువైట్లకు ఆ స్థాయిలో అప్పులున్నాయా? అంటూ చెవులు కొరుక్కొంటున్నారంతా. ఓ వెలుగు వెలిగి.. వరుస ఫ్లాపులతో తన ఫామ్ కోల్పోయిన శ్రీనువైట్ల ప్రస్తుత పరిస్థితేం బాలేదు. స్టార్ హీరోలు ఆయన్ని కాదంటున్నారు, నిర్మాతలు నమ్మడం లేదు. ఎలాగోలా.. మిస్టర్ అనే సినిమా పట్టాలెక్కించారు. కెరీర్ పరంగా.. అప్ అండ్ డౌన్స్ ఉన్నా శ్రీనువైట్ల ఆర్థిక పరిస్థితి భేషుగ్గా ఉందన్నది ఆయన సన్నిహితుల మాట. దూకుడు సినిమాకి శ్రీనువైట్ల పారితోషికం రూ.8 కోట్లు. ఆగడు సినిమాకి దాదాపు రూ.10కోట్లు తీసుకొన్నాడట. బ్రూస్లీకి కూడా బాగానే గిట్టింది. ఢీ, రెడీ హిట్లతో బాగానే సంపాదించుకొన్నాడు శ్రీనువైట్ల.
ఏ సినిమాకీ వెనుక నుంచి పెట్టుబడి పెట్టలేదు. కాబట్టి చేతులు కాల్చుకొని, డబ్బులు పోగొట్టుకొనే పరిస్థితి తెచ్చుకోలేదు శ్రీనువైట్ల. దానికి తోడు.. మనిషి చాలా జాగ్రత్త. ఆర్థిక వ్యవహారాల్లో నిక్కచ్చిగా ఉంటాడు.సో.. డబ్బులు పోయే పరిస్థితి లేదు. వరుస ఫ్లాపులు, ఇంట్లో గొడవలతో కాలం కలసి రావడం లేదంతే. 'ఇల్లు మారితే ఫలితం ఉంటుంది' అని వాస్తు నిపుణులు చెబితే...ఆ ప్రయత్నం మొదలెట్టాడు. అంతే తప్ప... శ్రీనువైట్ల అప్పుల్లో ఉన్నాడన్న మేటర్‌లో ఎలాంటి వాస్తవం లేదు. 'శ్రీనువైట్ల అప్పుల్లో ఎందుకుంటాడండీ.. ఆయనతో సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లు ఉంటారు గానీ' అంటూ ఆయన గురించి తెలిసిన వాళ్లు జోకులు వేసుకొంటున్నారు. సో.. శ్రీనువైట్ల కు నో ప్రాబ్లమ్ అన్నమాట.