ఆ రూమర్స్ నమ్మొద్దంటున్న డైరెక్టర్..!
on Jun 3, 2016
టాలీవుడ్ లో కొన్ని గాసిప్స్ ఎలా పుడతాయో అసలు అర్ధం కాదు. కొన్ని సార్లు ఈ రూమర్స్, కెరీర్లను నాశనం చేసేవరకూ వెళ్తుంటాయి. ఈ మధ్యే వచ్చిన కొన్ని రూమర్స్ ను చూస్తే ఇదెంత నిజమో అర్ధమవుతుంది. విషయానికొస్తే, వరుణ్ తేజ్, శ్రీను వైట్ల కాంబోలో తెరకెక్కబోయే సినిమా మిస్టర్. ఈ సినిమాకు స్టోరీ లైన్ తో సహా ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని, వరుణ్ కోసం ఎదురుచూస్తున్నాడు శ్రీను. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా ఆగిపోయిందని, వరుణ్ ముందు శేఖర్ కమ్ముల సినిమా చేస్తున్నాడని పుకారు ఒకటి బయటుదేరింది. కానీ వాస్తవం ఏంటంటే, ఈ నెలాఖరునుంచే సినిమాను స్పెయిన్ లో స్టార్ట్ చేస్తున్నారు. అక్కడ ఒక షెడ్యూల్ ముగిసిన తర్వాత షూటింగ్ ఇండియాలో కంటిన్యూ చేయబోతున్నారు. దీన్నంతటినీ పక్కన పెట్టేసి, సినిమా ఆగిపోయింది అన్న రూమర్ మాత్రం వైల్డ్ గా స్ప్రెడ్ అవడం విచిత్రం. ఇక ఇదే పరిస్థితి గోపీచంద్ మలినేనికి కూడా ఎదురైంది. సాయి ధరమ్ హీరోగా గోపీచంద్ తీస్తున్న సినిమా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం సాగింది. అయితే ముందే తెలుసుకున్న గోపీ, ఇదంతా ఫాల్స్ న్యూస్ అని, నమ్మద్దని, సినిమా పూర్తి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతోందని తన ట్విట్టర్లోకన్ఫర్ మేషన్ ఇచ్చాడు. నిజం నట్టిల్లు దాటేలోపే, పుకారు ఊరంతా షికారు చేసేస్తుందంటే ఇదేనేమో..