Publish Date:Aug 27, 2012
రాష్ట్రంలో ఇప్పుడంతా ఇందిరమ్మ భజన జరుగుతోంది. కాంగ్రెస్ నేతలంతా నెహ్రూకుటుంబాన్ని, ఇందిరాగాంధీని, రాజీవ్ గాంధీని పొగుడుతూ కాలం నెట్టుకొస్తున్నారు. సోనియా ముందు భజన చేయనివాళ్లగతి అధోగతే అవుతోంది. వై.ఎస్ హయాంలో మొదలైన ఈ భజన ఇప్పుడు తారాస్థాయికి చేరింది. భజన చేస్తేనే అమ్మ వరాలిస్తుందన్న విషయం సాధారణ కార్యకర్తలకుకూడా తెలిసిపోయింది. వై.ఎస్ బతికున్నన్నాళ్లూ ప్రభుత్వ పథకాలన్నింటికీ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల పేర్లు తగిలించేశారు. వై.ఎస్ హఠాన్మరణం తర్వాత అధికారపీఠమెక్కిన రోశయ్యకూడా ఆ పద్ధతినే కొనసాగించారు. అధిష్ఠానం భజన చేయడంలో దిట్ట అయిన రోశయ్య మెల్లగా గవర్నర్ గిరీని చేజిక్కించుకుని ఒత్తిడినుంచి తప్పించుకున్నారు.
తర్వాత వంతు కిరణ్ కుమార్ రెడ్డిది. కిరణ్ కుమారెరెడ్డికూడా లౌక్యంగా సోనియా భజన చేసుకుంటూ కాలం గడుపుకొస్తున్నారు. అధికారంలోకి రాగానే ఆయన ప్రారంభించిన మొదటి కార్యక్రమంపేరు ఇందిరమ్మ బాట.. ప్రభుత్వానికి ముందస్తు చూపులేని కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇదికూడా అధిష్ఠానం చలవేనంటూ కిరణ్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ కోత అనే పవర్ కట్ పథకాన్ని ప్రకటించారని ప్రతిపక్షాల నేతలు ఛలోక్తులు విసురుతున్నారు. త్వరలోనే సీఎం ఇందిరమ్మ విసనకర్రలు పేరుతో కొత్త పథకాన్నికూడా ప్రారంభించబోతున్నారని అంతా చెవులుకొరుక్కుంటున్నారు. గాలికోసం విసనకర్రలతో విసురుకునేటప్పుడు వాటిమీదున్న ఇందిరమ్మ ఫోటోని చూసి జనమంతా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారతారని, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘనవిజయం సొంతమౌతుందని కిరణ్ గట్టిగా భావిస్తున్నారని విపక్షాల నేతలు అనుకుంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/కిరణ్-కొత్తపథకం‘ఇందిరమ్మ-విసనకర్రలు’--24-16918.html
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది.
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.