Publish Date:May 30, 2012
జగన్ జ్యూడిషియల్ కస్టడీలో ఉండటంతో ఆయన తల్లి విజయమ్మ ప్రజల వద్దకు నేరుగా వెళ్ళారు. తన భర్త రాజశేఖరరెడ్డి మరణంపై తనకు అనేక అనుమానాలున్నాయని, అమాయకుడైన జగన్ ను కాంగ్రెస్, టిడిపిలు వేదిస్తున్నాయని ప్రచారం చేస్తూ ప్రజల సానుభూతిని పొందటానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లుగా విజయమ్మను తమ పార్టీల్లో నోరున్న మహిళా నాయకులతో ఎదుర్కోవాలని కాంగ్రెస్, టిడిపిలు నిర్ణయించాయి. పార్టీ ఆదేశాలు అందిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపి రేణుకాచౌదరి, గంగాభవానీ, తెలుగుదేశం పార్టీకి చెందిన పరిటాల సునీత, సినీనటి కవిత తదితరులు రంగంలోకి దిగి విజయమ్మపై విమర్శనాస్త్రాలను సంధించటం ప్రారంభించారు.
విజయమ్మ పుత్రవాత్సల్యంతో గాంధారిలా వ్యవహరిస్తూ దుర్యోధనుడు లాంటి జగన్ ను వెనుకేసుకువస్తున్నారని విమర్శిస్తున్నారు. పరిటాల హత్య కేసులో జగన్ ప్రమేయంపై అతనికి సిబిఐ గతంలో క్లీన్ చిట్ ఇచ్చిన ఆనందంతో ఆమె సి.బి.ఐ.ని పొగిడారని అదే సి.బి.ఐ.ని ఆమె విమర్శించడంలో అర్థం లేదని వారు అంటున్నారు. తన కుటుంబ బాధను ప్రజల బాధగా భావించి సానుభూతి కోసం విజయమ్మ డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్, టిడిపీల మహిళానాయకురాళ్ల దాడి నుంచి విజయమ్మను కాపాడేందుకు మహిళానాయకురాలు వాసిరెడ్డి పద్మ ఇప్పటికే రంగంలోకి దిగారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ys-vijayamma-24-14482.html
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది.
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు.. అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.