తెలంగాణలో మెడికల్ షాపులపై TG SAFE మెరుపు దాడులు..138 షాపులకు నోటీసులు.!

Publish Date:Nov 26, 2026

Advertisement

తెలంగాణలో అబార్షన్ కిట్ల అక్రమ విక్రయాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. మహిళల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) డ్రగ్స్ విభాగం, ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. గురువారం ప్రత్యేక బృందాలతో నిర్వహించిన ఈ తనిఖీల్లో భారీగా నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూశాయి. ఏకంగా 138 మెడికల్ షాపుల్లో అక్రమంగా అబార్షన్ కిట్లు (MTP Kits) విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. ఆయా షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

సాధారణ తనిఖీలకే పరిమితం కాకుండా, MTP కిట్ల విక్రయాలకు సంబంధించిన లావాదేవీల డేటాను అధికారులు విశ్లేషించారు. అనుమానాస్పదంగా లావాదేవీలు జరిగిన మెడికల్ షాపులను గుర్తించి ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. అబార్షన్ కిట్ల విచ్చలవిడి విక్రయాలకు అడ్డుకట్ట వేయడమే ఈ ప్రత్యేక డ్రైవ్ ప్రధాన లక్ష్యం.

ప్రిస్క్రిప్షన్ లేదు.. బిల్లులు లేవు.. నిబంధనలు బేఖాతర్.!

తనిఖీల్లో పలు మెడికల్ షాపులు కనీస నిబంధనలను కూడా పాటించడం లేదని అధికారులు గుర్తించారు. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు విక్రయించడం, వినియోగదారులకు బిల్లులు ఇవ్వకపోవడం, విక్రయాల రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడం వంటి ఉల్లంఘనలు బయటపడ్డాయి.

అంతేకాకుండా, రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అందుబాటులో లేకుండానే మందులు పంపిణీ చేయడం, ప్రిస్క్రిప్షన్ మందులకు సంబంధించిన రిజిస్టర్ల నిర్వహణలో నిర్లక్ష్యం, విక్రయ బిల్లుల ప్రతులను భద్రపరచకపోవడం వంటి లోపాలను కూడా అధికారులు గుర్తించారు. ముఖ్యంగా మిఫెప్రిస్టోన్ (Mifepristone), మిసోప్రోస్టోల్ (Misoprostol) వంటి షెడ్యూల్-హెచ్ ఔషధాల విక్రయాల్లో నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది.

138 షాపులకు నోటీసులు.. లైసెన్సులు రద్దు చేస్తారా?

నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించిన 138 మెడికల్ షాపులకు TG SAFE అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940తో పాటు సంబంధిత నిబంధనల ప్రకారం ఆయా షాపులపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు. ఉల్లంఘనల తీవ్రతను బట్టి డ్రగ్ లైసెన్సులను సస్పెండ్ చేయడం లేదా పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.

వైద్యుల పర్యవేక్షణ లేకుండా అబార్షన్ కిట్లు వాడితే ప్రమాదం.!

మరోవైపు, అబార్షన్ కిట్ల వినియోగంపై TG SAFE ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేసింది. వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ కిట్లలోని మందులను వినియోగించడం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని స్పష్టం చేసింది. మందులు వాడే ముందు తగిన వైద్య పరీక్షలు, అవసరమైన అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించుకోవాలని, అర్హత కలిగిన గైనకాలజిస్ట్ పర్యవేక్షణలోనే చికిత్స పొందాలని సూచించింది. నిబంధనల ప్రకారం అనుమతి పొందిన వైద్య కేంద్రాల్లోనే ఈ చికిత్స జరగాలని పేర్కొంది.

ముఖ్యంగా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భాశయం వెలుపల, సాధారణంగా ఫెలోపియన్ ట్యూబ్‌లో గర్భం ఏర్పడినప్పుడు ఈ మందులు పనిచేయవని హెచ్చరించింది. ఈ పరిస్థితిని ముందుగానే గుర్తించకుండా అబార్షన్ మందులు వాడితే అంతర్గత రక్తస్రావం వంటి ప్రాణాపాయ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వివరించింది.

అక్రమ విక్రయాలపై సమాచారం ఉంటే ఫిర్యాదు చేయండి.!

అబార్షన్ కిట్లు సాధారణ మందుల మాదిరిగా ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనుగోలు చేసి వినియోగించదగినవి కావని TG SAFE స్పష్టం చేసింది. షెడ్యూల్-హెచ్ నిబంధనల ప్రకారం వైద్యుల చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్‌తోనే లైసెన్స్ పొందిన మెడికల్ షాపులు వీటిని విక్రయించాలని పేర్కొంది.రాష్ట్రంలో ఎక్కడైనా అబార్షన్ కిట్ల అక్రమ విక్రయాలు, పంపిణీ జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే TG SAFE డ్రగ్స్ విభాగానికి ఫిర్యాదు చేయాలని కమిషనర్ ప్రజలను కోరారు. 

ఇందుకోసం 1800-599-6969 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులో ఉంచారు. పని దినాల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.మహిళల ఆరోగ్య భద్రతకు ముప్పుగా మారుతున్న అబార్షన్ కిట్ల అక్రమ విక్రయాలపై ఇకపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని TG SAFE స్పష్టం చేసింది.


మీకు నచ్చవచ్చు: గాల్లో ఎమర్జెన్సీ.. గోల్కొండలో చెట్టుపైకి దూసుకెళ్లిన విమానం.!

మీకు నచ్చవచ్చు: కడుపునొప్పి అని ఆసుపత్రికి వెళ్తే ..యువకుడి కడుపులో గర్భాశయం.! 


[ TG SAFE, Telangana Medical Shops, MTP Kits, Illegal Abortion Kits Sales, Drug Enforcement, Medical Shop Raids, Mifepristone, Misoprostol, Schedule H Drugs, Drug Licenses, Drug and Cosmetics Act 1940, Prescription Drugs, Women Health Safety, Telangana Health Department ]

By
en-us Political News

  
వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అత్యంత అరుదైన వైద్య కేసు వెలుగు చూసింది.
ఉమ్రి గ్రామానికి చెందిన కైలాస్ తన కుమార్తె కళ్యాణి ప్రేమ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఈ విషయం బయటకు తెలిస్తే గ్రామంలో   కుటుంబ పరువు పోతుందన్న భయంతో  తన కన్నబిడ్డ 18 ఏళ్ల కళ్యాణిని హత్య చేశాడు.  అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, మృతదేహాన్ని ఇంటిలోని మరో గదిలోకి తీసుకెళ్లి ఉరివేసి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా  నమ్మించే ప్రయత్నం చేశాడు.  
ఐటీ కారిడార్‌తో పాటు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సైబరాబాద్ పరిధిలో పౌర పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి శాశ్వత, సమీకృత భవనం అవసరమైంది. పర్యావరణ హితమైన నెట్-జీరో విధానంలో భవనాన్ని నిర్మించడం ద్వారా దీర్ఘకాలంలో నిర్వహణ, ఇంధన వినియోగంపై సానుకూల ప్రభావం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. అయినప్పటికీ భద్రత, తనిఖీల విషయంలో పోలీసులు ఇసుమంతైనా రాజీ పడకుండా వ్యవహరిస్తున్నారు. అనుమానిత వ్యక్తులు, వాహనాలు, వస్తువులపై ప్రత్యేక నిఘా పెట్టారు.
తెలంగాణ మట్టిలో పుట్టిన ప్రతి ఉద్యమ గాథ వెనుక ఎన్నో కన్నీళ్లు, ఎన్నో త్యాగాలు దాగి ఉన్నాయి.
తెలంగాణ పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికత వినియోగంలో మరో కీలక ముందడుగు వేస్తోంది
తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది.
అమ్మకు బంగారం కొనివ్వాలనుకున్నాడు.. సైబర్ మోసం బలితీసుకుంది.!
ట్రైనీ ఐపీఎస్ అధికారి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సహచర ట్రైనీ మహిళా అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి వ్యవహారంలో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తెలంగాణలో కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
తెలంగాణ గోల్డ్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన యాదగిరి చిన్ని గౌడ్ అలియాస్ దర్గా చిన్ని పహిల్వాన్ వ్యవహారంలో ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తును ముమ్మరం చేసింది.
హరీశ్‌రావుకు అసలు గురువు KCR కాదు..YSR.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.