ట్విన్ టవర్ నిర్మాణానికి ఈ టెండర్లు: ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.169 కోట్లు.!
Publish Date:Nov 26, 2026
Advertisement
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) శాశ్వత ప్రధాన కార్యాలయ భవన నిర్మాణ దిశగా కీలక ముందడుగు పడింది. 169 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అత్యాధునిక హంగులతో కూడిన ట్విన్ టవర్ నెట్-జీరో గ్రీన్ భవన సముదాయ నిర్మాణానికి కార్పొరేషన్ ఈ-టెండర్లను ఆహ్వానించింది. వేగంగా విస్తరిస్తున్న సైబరాబాద్ ప్రాంత ప్రస్తుత, భవిష్యత్ పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఈ భవన సముదాయాన్ని రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఇజ్జత్‌నగర్ ప్రాంతంలో, కొత్తకుంట చెరువు పక్కన ఉన్న 4.11 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. మొత్తం 2,41,540 చదరపు అడుగుల నిర్మిత వైశాల్యంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. ఇందులో ఒకదానికొకటి అంతర్సంధానితమై ఉండే రెండు భారీ టవర్లను నిర్మిస్తుండగా, వాటిలో ఒక టవర్ జీ+6 , మరొక టవర్ జీ+8 అంతస్తులతో ఉండనున్నాయి. ఈ భవన సముదాయాన్ని నెట్-జీరో గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు, ఇంధన సామర్థ్య మౌలిక సదుపాయాలు, నీటి సంరక్షణ చర్యలు, మురుగునీటి పునర్వినియోగ వ్యవస్థ, స్మార్ట్ బిల్డింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, వాతావరణానికి అనుగుణమైన డిజైన్ వంటి అంశాలను పొందుపరుస్తున్నారు. ఇది కూడా చదవండి: ఇక ఇల్లు, ఆఫీసు మాత్రమే కాదు.. పార్కుల్లోనూ ఉద్యోగం.. వర్క్ ఫ్రం పార్క్‌కు శ్రీకారం.! ఐటీ కారిడార్‌తో పాటు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సైబరాబాద్ పరిధిలో పౌర పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి శాశ్వత, సమీకృత భవనం అవసరమైంది. పర్యావరణ హితమైన నెట్-జీరో విధానంలో భవనాన్ని నిర్మించడం ద్వారా దీర్ఘకాలంలో నిర్వహణ, ఇంధన వినియోగంపై సానుకూల ప్రభావం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. టెండర్ల ప్రక్రియకు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారిక పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. టెండర్ల ప్రక్రియ పూర్తయి కాంట్రాక్టర్ ఎంపిక, తదుపరి అనుమతుల అనంతరం నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగే అవకాశం ఉంది. నిర్దేశిత ప్రణాళిక ప్రకారం భవన నిర్మాణం పూర్తయితే పౌర సేవలన్నీ ఒకే గొడుగు కిందకు వచ్చి ప్రజలకు మరింత సౌలభ్యం కలుగుతుందని స్థానికులు ఆశిస్తున్నారు. మీకు నచ్చవచ్చు: హైదరాబాద్ ఐఎస్ బీ చంద్రబాబు దార్శనికతకు దర్పణం బేటెక్ సిటీ: విశాఖకు అదనంగా హైటెక్ సిటీ తరహాలో కొత్త నగరం.! [Cyberabad Municipal Corporation, Izzatnagar Twin Towers, Net Zero Green Building, Tenders, TeluguOne]
ప్రజలకు వేగవంతమైన, మెరుగైన పౌర సేవలు అందించేందుకు ఈ నూతన ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. కౌన్సిల్ హాల్, ప్రజావాణి హాల్, సిటిజన్ సర్వీస్ సెంటర్లు, ఆడిటోరియం, ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్‌తో పాటు వివిధ విభాగాలు, అనుబంధ ప్రభుత్వ సంస్థల కార్యాలయాలకు కూడా ఇందులో స్థలం కేటాయించనున్నారు.
http://www.teluguone.com/news/content/cyberabad-municipal-corporation-24-237997.html





