Publish Date:May 30, 2012
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డికి పరిటాల రవి రూపంలో మరో ముప్పు ఎదురుకానుంది. 2005లో టిడిపి నాయకుడైన పరిటాల రవిని మొద్దుశ్రీను అనంతపురంలో కాల్చి చంపాడు. ఈ హత్య వెనుక జగన్ హస్తముందని అప్పట్లో ఆరోపణలు రావడంతో నాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సిబిఐ విచారణకు ఆదేశించారు. ఈ హత్య కేసులో జగన్ ప్రమేయమేమీ లేదంటూ అప్పట్లో సిబిఐ తేల్చి చెప్పింది. అయితే నాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సిబిఐను మేనేజ్ చేశారని, అందువల్ల జగన్ పాత్రపై మరోసారి విచారణ జరపాలని పరిటాల రవి భార్య, టిడిపి ఎమ్యెల్యే పరిటాల సునీత డిమాండు చేస్తున్నారు. ప్రభుత్వం కనుక తన డిమాండుకు అంగీకరించకపోతే ఆమరణ దీక్ష చేస్తానని ఆమె హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా తన భర్త హత్యపై పునర్విచారణ జరపాలంటూ ఆమె సిబిఐ ఉన్నతాధికార్లకు కూడా లేఖ రాయాలనుకుంటున్నారు. ఇప్పటికే పలుకేసులతో సతమతమవుతూ జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న జగన్ కు పరిటాల హత్య కేసు రూపంలో మరో సమస్య ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. పరిటాల సునీత ఈ అంశంపై గట్టిగా నిలబడితే ప్రభుత్వం మళ్లీ ఈ కేసు పునర్విచారణకు ఆదేశించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/---ys-jagan-paritala-ravi-24-14483.html
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది.
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు.. అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.