లగడపాటి ఓవరాక్షన్ కు కారణం ఏమిటీ?
Publish Date:May 30, 2012
Advertisement
విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పొట్టివాడైనా గట్టివాడన్న పేరు తెచ్చుకున్నారు. రాజకీయలభ్ది కోసం ఆయన దేనికీ వెనుకాడరు. ప్రచారం కోసం ఖద్దరు బట్టలు వేసుకుని జెండా మోస్తూ పాదయాత్రలు చేస్తారు. జాతీయ జెండా రూపశిల్పి వెంకయ్య పేరిట పరుగుల పోటీలు పెట్టి ప్రచార లభ్ది పొందుతారువిజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పొట్టివాడైనా గట్టివాడన్న పేరు తెచ్చుకున్నారు. రాజకీయలభ్ది కోసం ఆయన దేనికీ వెనుకాడరు. ప్రచారం కోసం ఖద్దరు బట్టలు వేసుకుని జెండా మోస్తూ పాదయాత్రలు చేస్తారు. జాతీయ జెండా రూపశిల్పి వెంకయ్య పేరిట పరుగుల పోటీలు పెట్టి ప్రచార లభ్ది పొందుతారు. తెలంగాణా ఉద్యమం ముమ్మరంగా సాగుతున్న సమయంలో విజయవాడలో పోలీసులకు కన్నుగప్పి హైదరాబాద్ నిమ్స్ పారిపోయారు. ఇలా ఎప్పుడూ ఏదో ఒక వింత చేష్ట చేస్తూ వార్తలకు ఎక్కుతుంటారు. ఈ మధ్యన కొంత గ్యాప్ వచ్చిందని అనుకుంటున్న తరుణంలో మళ్లీ పత్రికలకు ఎక్కి సంచలన ప్రకటనలు ఇవ్వటం ప్రారంభించారు. ఒకప్పుడు సాక్షిలో 35 కోట్లకు పైగా పట్టుబడులు పెట్టిన రాజగోపాల్ ఇప్పుడు జగన్ ను తీవ్రంగా ద్వేషిస్తున్నారు. జగన్ తప్పు చేసినప్పుడే ఆయన తల్లి చెంపలు వాయించి ఉంటే నేడు జగన్ కు ఈ దుస్థితి వచ్చేది కాదని ఈయన అంటున్నారు. రాజగోపాల్ నడత కూడా సరైనది కాదనీ, భార్య పద్మకు ద్రోహం చేసి మరో అమ్మాయికి తాళి కట్టారని, ఇటువంటి అనైతిక పనులకు పాల్పడుతున్న రాజగోపాల్ చెంపలను ఆయన తల్లి ఇప్పటికైనా వాయకొట్టాలని ఆయన ప్రత్యర్దులు అంటున్నారు. అప్పుడప్పుడు రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీకి తానే పెద్దదిక్కు అన్నట్లు మాట్లాడుతుంటారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసేవారిని క్షమించనన్నట్లుగా చెబుతుంటారు. తాజాగా కొండాపూర్ లోని ఆయన రిస్టార్స్ లో పేలుళ్ల ప్రహసనం జరిగింది. ఈ పేలుళ్లకు జగన్ అనుచరులే బాధ్యులనీ ఆయన అనుమానిస్తున్నారు. అయితే డ్రామాలు ఆడటంలో దిట్ట అయిన రాజగోపాలే రిసార్ట్స్ పేలుళ్ల డ్రామా ఆడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఏదేమైనా రాజగోపాల్ చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఏనాటికైనా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కావాలన్నది ఆయన దు.రా.లోచన అని ఆయన ప్రత్యర్థులు అంటున్నారు. ఆ ఉద్దేశ్యంతోనే ఆయన నిత్యం ఏదో రూపంలో వార్తల్లోకి ఎక్కాలనుకున్నట్లు వారు ఆరోపిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/vijayawada-mp-lagadapati-rajagopal-24-14481.html





