తెలంగాణలో టెంపుల్ కారిడార్: గోదారి తీరం వెంబడి పుణ్యక్షేత్రాల అనుసంధానం.!

Publish Date:Nov 27, 2026

Advertisement

తెలంగాణలో టెంపుల్ కారిడార్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. బాసర నుంచి భద్రాచలం వరకూ గోదారి తీరం వెంబడి ఉన్న పుణ్య క్షేత్రాలను అనుసంధానిస్తూ ఈ టెంపుల్ కారిడార్ ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.   భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  పరిశీలించి, సమీక్షించారు. ఆలయ ప్రాంగణం, మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులతో చర్చించి పనుల పురోగతిపై ఆరా తీశారు. 

  పొంగులేటి.. వచ్చే ఏడాది  గోదావరి పుష్కరాలతో పాటు ముక్కోటి ఏకాదశి వంటి ముఖ్య ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని భద్రాచలం వద్ద నిర్మాణాలను వేగవంతం చేయాలని  ఆదేశించారు.   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ  పక్షం  రోజులకు ఒకసారి పనుల పురోగతిని సమీక్షిస్తోందని మంత్రి వెల్లడించారు.  

ఇక భద్రాచలం  ఆలయ అభివృద్ధి, గోదావరి ఘాట్‌లు, పరిసర ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే  నిధులు, దశలవారీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా ఆలయ పరిసరాల అభివృద్ధితో పాటు పట్టణ మౌలిక వసతుల మెరుగుదలపై దృష్టి పెట్టారు. గోదావరి నది తీరంలోని ఆధ్యాత్మిక కేంద్రాలను ఒక మార్గంగా అనుసంధానించడం ద్వారా యాత్రికుల రాకపోకలు మరింత సులభతరం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

గోదావరి తీరం వెంబడి ఉన్న దేవాలయాలకు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను ప్రజలలో విస్తృతంగా ప్రజారం చేయడం ద్వారా విశేష ప్రాచుర్యం కల్పించాలని నిర్ణయించింది. అలాగే  బాసర నుంచి భద్రాచలం వరకు కారిడార్ ఏర్పాటు చేయడం వల్ల ఆయా ప్రాంతాల్లో పర్యాటక రంగం, అనుబంధ రంగాల కార్యకలాపాలు జోరందుకుంటాయని ప్రభుత్వం భావిస్తోంది.  

ఇది కూడా చదవండి:  బాసరకు పోటెత్తిన భక్తులు: జ్ణానసరస్వతి జన్మనక్షత్రం సందర్భంగా పెద్ద సంఖ్యలో అక్షరాభ్యాసాలు.!​

క్షేత్రస్థాయి పనుల పర్యవేక్షణ, సమీక్షా సమావేశాల ద్వారా పనుల్లో జాప్యం జరగకుండా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్థానిక ప్రజాప్రతినిధులు, యంత్రాంగం కలిసి పనిచేయడం వల్ల భూసేకరణ, నిర్మాణ అనుమతులు వంటి అంశాల్లో వేగం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. 

రాబోయే రోజుల్లో టెంపుల్ కారిడార్ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రణాళికలు, పనుల దశలవారీ పురోగతిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముక్కోటి ఏకాదశి, గోదావరి పుష్కరాల నాటికి నిర్దేశించిన పనులు ఏ మేరకు పూర్తవుతాయనే దానిపై అందరి దృష్టి నిలిచింది.

మీకు నచ్చవచ్చు:   భద్రాచలం పేరు అలా వచ్చింది​

పవన్ భద్రాచలం పర్యటన రద్దు​

[Telangana Temple Corridor, Basara,  Bhadrachalam, Ponguleti Srinivasa Reddy, Developement, TeleguOne]

By
en-us Political News

  
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణలో అబార్షన్ కిట్ల అక్రమ విక్రయాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అత్యంత అరుదైన వైద్య కేసు వెలుగు చూసింది.
ఉమ్రి గ్రామానికి చెందిన కైలాస్ తన కుమార్తె కళ్యాణి ప్రేమ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఈ విషయం బయటకు తెలిస్తే గ్రామంలో   కుటుంబ పరువు పోతుందన్న భయంతో  తన కన్నబిడ్డ 18 ఏళ్ల కళ్యాణిని హత్య చేశాడు.  అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, మృతదేహాన్ని ఇంటిలోని మరో గదిలోకి తీసుకెళ్లి ఉరివేసి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా  నమ్మించే ప్రయత్నం చేశాడు.  
ఐటీ కారిడార్‌తో పాటు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సైబరాబాద్ పరిధిలో పౌర పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి శాశ్వత, సమీకృత భవనం అవసరమైంది. పర్యావరణ హితమైన నెట్-జీరో విధానంలో భవనాన్ని నిర్మించడం ద్వారా దీర్ఘకాలంలో నిర్వహణ, ఇంధన వినియోగంపై సానుకూల ప్రభావం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. అయినప్పటికీ భద్రత, తనిఖీల విషయంలో పోలీసులు ఇసుమంతైనా రాజీ పడకుండా వ్యవహరిస్తున్నారు. అనుమానిత వ్యక్తులు, వాహనాలు, వస్తువులపై ప్రత్యేక నిఘా పెట్టారు.
తెలంగాణ మట్టిలో పుట్టిన ప్రతి ఉద్యమ గాథ వెనుక ఎన్నో కన్నీళ్లు, ఎన్నో త్యాగాలు దాగి ఉన్నాయి.
తెలంగాణ పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికత వినియోగంలో మరో కీలక ముందడుగు వేస్తోంది
తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది.
అమ్మకు బంగారం కొనివ్వాలనుకున్నాడు.. సైబర్ మోసం బలితీసుకుంది.!
ట్రైనీ ఐపీఎస్ అధికారి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సహచర ట్రైనీ మహిళా అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి వ్యవహారంలో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తెలంగాణలో కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.