ముఖ్య సలహాదారు పాత్ర ముగిసినట్టేనా? జగన్ మనసు ఎందుకు మారింది?

Publish Date:Aug 29, 2019

Advertisement

 

అజయ్ కల్లం రెడ్డి... జగన్ కోటరీలో అత్యంత కీలకమైన వ్యక్తి... మూడేళ్ల పదవీకాలంతో  ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా అపాయింటైన అజేయ కల్లం రెడ్డికి తెలియకుండా జగన్ ప్రభుత్వంలో ఏమీ జరగదనే చెప్పాలి... ఆయా శాఖాధిపతులైనా... చివరికి సీఎస్ అయినా... డీజీపీ అయినా... అజేయ కల్లం రెడ్డికి చెప్పకుండా... ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోలేరని అంటారు.... అంతటి పవర్స్ ను ఆయనకు కట్టబెట్టారు సీఎం జగన్మోహన్ రెడ్డి. సీఎంవోలో అధికారగణం, ప్రభుత్వ సలహాదారులు... ఇలా ఎవరైనాసరే అజేయకల్లంరెడ్డికే రిపోర్ట్ చేయాల్సిందే. అజేయకల్లంరెడ్డిపై జగన్మోహన్ రెడ్డి అంత నమ్మకం పెట్టుకున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే ప్రభుత్వ పాలనను, విధానాలను జగన్ ఆయన చేతిలో పెట్టారు. అయితే, అజేయ కల్లంరెడ్డిపై జగన్ పెట్టుకున్న నమ్మకం సన్నగిల్లిందనే మాట అమరావతిలో వినిపిస్తోంది. మూడేళ్ల పదవీకాలంతో అపాయింటైన అజయ్ కల్లం రెడ్డి... మూడు నెలలు కూడా కాకుండానే ముగిసిపోనుందనే ప్రచారం జరుగుతోంది. సీఎంవోలో అన్నీ తానై పాలనా వ్యవహారాలు చక్కబెడుతున్న అజేయకల్లంరెడ్డిని సాగనంపడానికి డెసిషన్ జరిగిపోయిందనే మాట వినిపిస్తోంది.

జగన్ అమెరికా పర్యటనలో ఉండగా.... ప్రభుత్వానికి జరిగిన నష్టంపై సీఎం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పోలవరం, అమరావతి, పీపీఏలు, రివర్స్ టెండరింగ్ లాంటి అంశాలను సరిగ్గా డీల్ చేయలేకపోయారని జగన్ మండిపడ్డారట. అమరావతిపై ప్రభుత్వం ఎందుకు ముందుకు వెళ్లలేకపోతుందో... పోలవరంలో రివర్స్ టెండరింగ్ ఎందుకో... పీపీఏల పునసమీక్షకు కారణాలేంటో... ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పడంలో... కేంద్రాన్ని ఒప్పించడంలో మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందనే భావనకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి... దీనంతటికి అజేయకల్లంరెడ్డిని బాధ్యులుగా చేసినట్లు తెలుస్తోంది. ఇదంతా రాజకీయ వైఫలమైనప్పటికీ... మొత్తం అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థనే అజేయకల్లం చేతిలో పెట్టినందున.... పాలనాపరమైన వైఫల్యంగా లెక్కగట్టి.... అజేయకల్లంరెడ్డిని సాగనంపడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

అయితే, అజయ్ కల్లంరెడ్డి వైపు నుంచి కూడా మిస్టేక్స్ ఉన్నాయనే మాట వినిపిస్తోంది. అసలు అమరావతి పాలసీ ఏమిటో, ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుందో... అర్ధమయ్యేలా చెబుతూ మంత్రులకు అజేయకల్లం సరైన గైడెన్స్ ఇవ్వలేకపోయారని అంటున్నారు. అందుకే సున్నితమైన రాజధాని అంశాన్ని మంత్రులు పెద్ద వివాదంగా మార్చేశారని జగన్ అంచనాకి వచ్చారట. అందుకే, ముఖ్య సలహాదారును సాగనంపి...  ఇకపై పాలనావ్యవహారాలన్నీ పూర్తిగా తానే చూసుకోవాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి వచ్చారట.

By
en-us Political News

  
ఈ ఆందోళనలకు నేరుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఐదేళ్ల పాలనలో వైసీపీ నిర్వాకాన్ని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సభలో ఎండగడుతుందన్న భయంతోనే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు.
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.