శవ రాజకీయం.. బూమరాంగ్ అవుతున్న వైసీపీ ట్రేడ్ మార్క్ వ్యూహాలు?

Publish Date:Jul 17, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా శవరాజకీయం అంశం చర్చనీయాంశంగా మారింది.   రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా,  ఎవరైనా అనుమానాస్పద స్థితిలో మరణించినా వెంటనే  రాజకీయ కోణంలో చిత్రీకరించేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోందన్న భావన జనబాహుల్యంలోనే వ్యక్తం అవుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే..  ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు. 

ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తే, రాష్ట్రంలో సంభవించే ప్రతి చావునూ వైసీపీ  తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత కక్షలు, భూ వివాదాలు, కుటుంబ తగాదాలు లేదా ఆర్థిక లావాదేవీల వల్ల జరిగే నేరాలకు కూడా  రాజకీయ రంగు పులిమే ప్రయత్నం జరుగుతోంది. చనిపోయిన వ్యక్తి తమ పార్టీకి చెందిన కార్యకర్త అని, అధికార పార్టీ నాయకుల వేధింపుల వల్లే ఈ ఘోరం జరిగిందని వైఎస్సార్సీపీ అగ్రనాయకత్వం నుంచి స్థానిక నేతల వరకు అంతా ఒకే రాగంతో ప్రచారం ప్రారంభిస్తున్నారు. ఇలాంటి ఆరోపణల ద్వారా కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందనే భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనేదే వైసీపీ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.

అయితే..  ఈ తరహా   ప్రచారాలు చాలా సందర్భాల్లో వైసీపీకి బూమరాంగ్ అవుతున్నాయంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే..  ఏదైనా ఒక ఘటన జరిగిన వెంటనే దానికి రాజకీయ రంగు పూసినప్పటికీ, ఆ తర్వాత పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. నిందితులు,  బాధితుల మధ్య ఉన్న పాత పగలు, వ్యక్తిగత వివాదాలే ఆయా నేరాలకు కారణమని ఆధారాలతో సహా తేలిపోతోంది. కొన్ని సందర్భాల్లో స్వయంగా బాధితుల కుటుంబ సభ్యులే మీడియా ముందుకు వచ్చి, తమకు ఎటువంటి రాజకీయ సంబంధాలు లేవని, ఇది పూర్తిగా వ్యక్తిగత గొడవ అని స్పష్టం చేస్తున్నారు. దీంతో ప్రాథమిక సమాచారాన్ని సరిచూసుకోకుండానే శవాల వద్దకు వెళ్లి ధర్నాలు చేయడం, నిరసనలు తెలపడం వల్ల వైఎస్సార్సీపీ తీవ్రంగా ఆభాసుపాలవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక డిజిటల్ యుగంలో సమాచారం  వేగంగా ప్రజలకు అందుతోంది. ఒకప్పుడు ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఒక విషయాన్ని ప్రచారం చేస్తే, అదే నిజమని నమ్మే పరిస్థితి ఉండేది. కానీ నేడు సోషల్ మీడియా,  స్థానిక సమాచార వ్యవస్థల వల్ల ప్రతి ఒక్కరికీ క్షణాల్లో అసలు విషయాలు తెలిసిపోతున్నాయి. సంఘటన జరిగిన ప్రదేశంలో వాస్తవంగా ఏం జరిగిందనేది స్థానికులు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. దీంతో వైసీపీయుల  ఆరోపణల్లో నిజానిజాలు ఎలాంటి జాప్యం లేకుండా జనబాహుల్యంలోకి వేగంగా చేరిపోతున్నాయి.  దీంతో   నిజానిజాలు తెలుసుకోకుండా కేవలం శవ రాజకీయాలు చేయడమే లక్ష్యంగా వైసీపీ వేస్తున్న అడుగులు అపహాస్యం పాలౌతున్నాయి.   

 2019 ఎన్నికలకు ముందు జరిగిన కొన్ని కీలక పరిణామాలు, మరణాలు, దాడుల ఉదంతాలను  వైసీపీ అప్పట్లో  తమకు అనుకూలంగా సానుభూతి కలిగేలా మరల్చుకోగలిగింది. కోడి కత్తి, వైఎస్ వివేకా హత్య వంటి సంఘటనలు అప్పట్లో   వైసీపీకిగా అనుకూలంగా మారియి. ఆ తరువాత అసలు విషయాలు జనంలోకి వెళ్లాయనుకోండి అది వేరే సంగతి. ఇప్పుడు కూడా వైసీపీ అదే ఫార్ములానుఅమలు చేయాలని చూస్తోంది కానీ ఫలితం మాత్రం ఉండటం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    

AP politics, YS Jagan, TDP Alliance government, Law and order, Andhra Pradesh

By
en-us Political News

  
ప్రశాంత్ కిశోర్ మాత్రం ఈ సారి ఇంట గెలవాలన్న కృత నిశ్చయంతో ముందుకు సాగారు. ఎందరో నేతలను అధికార పీఠంపై కూర్చోబెట్టగలిగిన తాను బీహార్ అసెంబ్లీలో అడుగు పెట్టడం ద్వారా సత్తా చాటి.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో... బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలోకి దిగి దాదాపు 20 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ప్రధాని మోడీ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత.. అంటే దాదాపు పుష్కర కాలం తరువాత.. ప్రస్తుతం బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందనడానికి ఈ ఫలితాలు నిదర్శనం అంటున్నారు పరిశీలకులు.
సాధారణంగా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు లేదా ఉప ముఖ్యమంత్రులు ప్రధానిని ప్రశంసించడం రివాజే. కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు, సహకారం కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఎంతో దోహదపడతాయి. అయితే భోగాపురం వేదికగా జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రశంసల హద్దులు దాటిపోయాయన్నది పరిశీలకుల విశ్లేషణ.
ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్ర స్థాయి పాలనా వ్యవహారాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతుండటంతో.. కుప్పం బాధ్యతలను ఆయన అర్థాంగి   నారా భువనేశ్వరి భుజానికెత్తుకున్నారు. తరచుగా కుప్పంలో పర్యటిస్తూ.. నియోజకవర్గ అభివృద్ధి పనుల పర్యవేక్షణ, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడంతో పాటు నియోజకవర్గ ప్రజలతో నేరుగా మమేకమౌతున్నారు.  
పవన్ కల్యాణ్ కోసం గ2024 ఎన్నికలలో తన సీటును త్యాగం చేసి మరీ ఆయన విజయం కోసం పాటుపడిన వర్మకు.. పార్టీలో త్యాగానికి తగిన గుర్తింపు లభించలేదు. అయినా అదే పిఠాపురం వర్మ.. బొండా ఉమా విమర్శలపై మిగిలిన నేతలంతా మౌనంగా ఉండిపోయిన వేళ.. మీడియా సమావేశం పెట్టి మరీ బోండా ఉమాకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
మోడీ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ కూడా జవాబుదారీ తనంగా చెప్పుకోవడం లేదు. ఇక దేశ యువత ప్రజా నిరసనలకు మోడీ సర్కార్ దిగి వచ్చిందని చెబుతున్నారు. అయతే ఒక్క వైసీపీ మాత్రమే బీజేపీ విషయంలో.. కాదు కాదు మోడీ విషయంలో రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తోంది.
బీజేపీకి ఆర్ఎస్ఎస్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక విధానపరమైన నిర్ణయాల వెనుకా ఆర్ఎస్ఎస్ ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. అయితే.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆర్ఎస్ఎస్ ఆసంతృప్తిగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఈ ఆందోళనలకు నేరుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఐదేళ్ల పాలనలో వైసీపీ నిర్వాకాన్ని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సభలో ఎండగడుతుందన్న భయంతోనే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు.
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.