హరీష్ రావు.. కారు దిగి కాషాయ జెండా భుజానికెత్తుకుంటారా?

Publish Date:Jul 11, 2026

Advertisement

 

తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎస్ కీలక నేత, ఆ పార్టీలో ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అడుగులు ఎటువైపు అన్న చర్చ జోరుగా సాగుతోంది. అసలు 2018 ఎన్నికలకు ముందు నుంచే హరీష్ రావు.. కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచి సొంత వర్గంతో కాషాయగూటికి చేరుతారన్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత ఆ ప్రచారం మరింత జోరందుకుంది. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఇప్పుడు హరీష్ రావు రాజకీయ గమనం రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.  

ఇంతకీ రేవంత్ రెడ్డి ఏమన్నారంటే.. హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ,  ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.  వాస్తవానికి హరీష్ రావు కారు దిగడంపై చర్చోపచర్చలు జరిగాయి. కాళేశ్వరం విషయంలో హరీష్ అవినీతికి పాల్పడ్డారని భావించిన కేసీఆర్.. ఆయనను  పార్టీకి, పార్టీ కార్యక్రమాలకూ దూరంపెట్టారన్న ప్రచారం జోరుగా సాగింది. అలాగే  రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండో సారి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత రమారమి ఏడాది పాటు హరీష్ ను కేబినెట్ లోకి తీసుకోలేదు. ఈ విషయాలను గుర్తు చేసి మరీ రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ కార్యనిర్వాహఖ అధ్యక్షుడు కేటీఆర్ కన్నెపల్లి ప్రాజెక్ట్ వద్దకు హరీష్ ని ఎందుకు వెంటబెట్టుకుపోలేదని ప్రశ్నించారు. ఇక పోతే  బిఆర్ఎస్ లో అంతర్గతంగా కేటీఆర్ వర్సెస్  హరీష్ కేంద్రంగా ఆధిపత్య  పోరు సాగుతుందని సొంత పార్టీ క్యాడరే అంటున్న పరిస్థితి. 

కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టకపోవడానికి, ఇప్పటికీ బిఆర్ఎస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేటీఆర్ పేరు కేసీఆర్ ప్రకటించకపోవడానికీ తెర వెనుక ఉన్న కారణం ఇదేనన్న ప్రచారం కూడా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. తాజాగారేవంత్ రెడ్డి హరీష్ బీజేపీ గూటికి అంటే చేసిన వ్యఖ్యలు ఆ ప్రాచారానికి మరింత బలం చేకూర్చాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ ఏ విధంగా స్పందిస్తారన్నది చూడాలి. 

Harish Rao to Join Bjp, Revanth Reddy vs Harish Rao, Telangana Politics, BRS BJP Secret Alliance, Revanth Reddy Challenges KCR, Telangana Political News Latest.

By
en-us Political News

  
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించడానికి అప్పట్లో పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జగన్ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఉండటంతో అప్పట్లో జిల్లా నేతల్లో ఎవరూ అయన్నివ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు.
తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీ తరపున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన జకియా ఖానం, పందుల రవీంద్రబాబుల పదవీ కాలం నెల రోజుల్లో ముగియనుంది. దీనితో ఖాళీ అవుతున్న ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం కూటమి దక్కించుకోనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నో ఆలయాలు నిధులు లేక, ధూపదీప నైవేద్యాలు కరవై శిథిలావస్థకు చేరుకుంటుంటే.. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆలయాలకు శ్రీవాణి నిధులు కేటాయించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కొండగట్టు వంటి తెలంగాణ ఆలయాలకు టిటిడి నిధులు ఇవ్వడంపై అక్కడి కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఆలయాల అభివృద్ధికి ఏపీ నిధులు ఎందుకు కేటాయించాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.