ఢిల్లీ పోరాటాల హోరు.. నింపేనా కాంగ్రెస్ లో జోరు?

Publish Date:Jul 23, 2026

Advertisement

 హస్తిన  వేదికగా రగులుతున్న ఆందోళనలు   దేశ రాజకీయాల్లో   ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత కొంతకాలంగా సరైన రాజకీయ ప్రాధాన్యత కోసం  శ్రమిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ నిరసన జ్వాలలు అందివచ్చిన అవకాశంగా మారాయి.   నీట్  అక్రమాలపై విద్యార్థి లోకం చేపట్టిన పోరాటం  ఉథృతమై కేంద్రానికి సవాల్ గా మారింది. మోడీ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఈ మూడు దఫాలలోనూ ఈ స్థాయిలో నిరసనలు ఎన్నడూ ఎదుర్కొన్న పరిస్థితి లేదు.  ఈ ఆందోళనలకు నేరుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వద్ద  ధర్నా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో   చర్చనీయాంశంగా మారింది.

ఈ పోరాటంలో రాహుల్ గాంధీ దూకుడు, ప్రసంగం ఆయనలో గతంలో ఎన్నడూ చూడని కొత్త ఫైర్  కనిపించేలా చేశాయి.   విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ విరుచుకుపడ్డారు.  విద్యార్థి సమాజం చేపట్టిన ఈ ఆందోళనకు తోడుగా, పంజాబ్ రైతులు కూడా ఢిల్లీకి తరలి రావడం ఉద్యమానికి ఊపు తీసుకురావడమే కాకుండా, కేంద్రాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది.  భారత్-అమెరికా మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పంజాబ్ రైతాంగం, ఢిల్లీ  మార్చ్ నిర్వహిస్తూ విద్యార్థుల నిరసనలకు పూర్తి మద్దతు ప్రకటించింది.

ఒకే వేదికపైకి విద్యార్థుల సమస్యలు, రైతాంగ ఆవేదన వచ్చి చేరడంతో నిస్సందేహంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేసింది.    నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన లోపాలు, పారదర్శకతా లోపంపై  దేశవ్యాప్తంగా యువత ఆగ్రహంతో రగిలిపోతుంటే..   వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం చూపేలా ఇండియా అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం రైతులు సైతం వీధుల్లోకి రాక తప్పని పరిస్థితిని తీసుకువచ్చింది.   కర్షకులు, జెన్ జెడ్ కలయిక  కేంద్రానికి పెద్ద తలనొప్పిగా పరిణమించింది. 

ఈ పరిణామాలను కాంగ్రెస్ రాజకీయ అవకాశంగా మలచుకోవడానికి ప్రయత్నిస్తున్నది.   రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఈ ఉద్యమానికి నాయకత్వం వహించి తన నాయకత్వ పటిమను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, నిరసన ప్రదర్శనల్లో ప్రత్యక్షంగా భాగస్వామి కావడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. పరిశీలకులు కూడా జాప్యం అయినా రాహుల్ ప్రత్యక్షంగా ఉద్యమానికి మద్దతుగా నిలవడం ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపిందనడంలో సందేహం లేదు.  నిరసనకారుల వేదికపై నిలబడి రాహుల్ చేసిన  ఘాటు విమర్శలు, కేంద్ర విధానాలను ప్రశ్నించిన తీరు ప్రజాబాహుల్యాన్ని మొప్పించింది. 

ప్రస్తుత నీట్ వివాదం, రైతు నిరసనల కలయిక కాంగ్రెస్‌కు  బలమైన వేదికగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాన్నికాంగ్రెస్  క్షేత్రస్థాయి నుంచి ఎంత ప్రభావమంతంగా వాడుకుంటుందన్నదానిపైనే ఆ పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంది. 

ప్రస్తుతానికి ఈ ఆందోళనలు, ధర్నాలు ఎక్కువగా దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతానికే పరిమితమై ఉన్నాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి, బీజేపీ బలీయమైన పరిపాలనా యంత్రాంగానికి ఢిల్లీ పరిధిలో  ఇటువంటి ఆందోళనలను అదుపు చేయడం అంత సంక్లిష్టమైన విషయమేమీ కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముందున్న అసలైన సవాలు ఈ ఆందోళనలను  హస్తినకే పరిమితం చేయకుండా, దేశం  నలుమూలలకూ  విస్తరింపజేయడమే. దేశవ్యాప్తంగా  విద్యార్థులు, రైతులు, సాధారణ ప్రజలలో ఈ భావజాలాన్ని బలంగా తీసుకెళ్లగలిగితేనే  కాంగ్రెస్ రాజకీయంగా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది.  

రాబోయే ఎన్నికల నాటికి ఈ ప్రజాగ్రహాన్ని ఓట్లుగా మలచడం కాంగ్రెస్ నాయకత్వానికి నిజమైన సవాలు.  కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, దానిని నిలకడైన వ్యూహంతో ముందుకు తీసుకెళ్లగలిగితేనే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం లభించే అవకాశం ఉంటుంది.  

 Congress Protests, Rahul Gandhi Modi Residence,  NEET Exam Controversy,  Punjab Farmers Delhi March, India US Trade Agreement 

By
en-us Political News

  
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వైసీపీ.. ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. దీని వెనుక వైసీపీ 2029 ఎన్నికల వ్యూహం ఉందంటున్నారు పరిశీలకులు. కేవలం రాజకీయ విమర్శల విషయంలో వచ్చిన మార్పు కాదనీ, 2029 ఎన్నికల దిశగా వైసీపీ వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోందంటున్నారు.
రాజ్యాంగబద్ధంగా రాని…ప్రజలు ఇవ్వని విపక్ష హోదా కోసం జగన్ పోరాడి ఉపయోగం లేదు. అయినా ప్రజా సమస్యలపై పోరాడడానికి ప్రతిపక్ష హోదా అవసరం ఏముందని పరిశీలకులు అంటున్నారు. అయితే ఆ విషయాన్ని గుర్తించని, లేదా గుర్తించడానికి ఇష్టపడని జగన్.. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లుగా వ్యవహరిస్తూ.. పార్టీ ప్రతిష్ఠను మరింత మసకబారుస్తున్నారు
జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన  వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. తనకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీనీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబంపై వంశీ నోరు పారేసుకున్న తీరు  అప్పట్లో సంచలనం సృష్టించింది.
ప్రశాంత్ కిశోర్ మాత్రం ఈ సారి ఇంట గెలవాలన్న కృత నిశ్చయంతో ముందుకు సాగారు. ఎందరో నేతలను అధికార పీఠంపై కూర్చోబెట్టగలిగిన తాను బీహార్ అసెంబ్లీలో అడుగు పెట్టడం ద్వారా సత్తా చాటి.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో... బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలోకి దిగి దాదాపు 20 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ప్రధాని మోడీ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత.. అంటే దాదాపు పుష్కర కాలం తరువాత.. ప్రస్తుతం బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందనడానికి ఈ ఫలితాలు నిదర్శనం అంటున్నారు పరిశీలకులు.
సాధారణంగా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు లేదా ఉప ముఖ్యమంత్రులు ప్రధానిని ప్రశంసించడం రివాజే. కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు, సహకారం కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఎంతో దోహదపడతాయి. అయితే భోగాపురం వేదికగా జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రశంసల హద్దులు దాటిపోయాయన్నది పరిశీలకుల విశ్లేషణ.
ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్ర స్థాయి పాలనా వ్యవహారాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతుండటంతో.. కుప్పం బాధ్యతలను ఆయన అర్థాంగి   నారా భువనేశ్వరి భుజానికెత్తుకున్నారు. తరచుగా కుప్పంలో పర్యటిస్తూ.. నియోజకవర్గ అభివృద్ధి పనుల పర్యవేక్షణ, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడంతో పాటు నియోజకవర్గ ప్రజలతో నేరుగా మమేకమౌతున్నారు.  
పవన్ కల్యాణ్ కోసం గ2024 ఎన్నికలలో తన సీటును త్యాగం చేసి మరీ ఆయన విజయం కోసం పాటుపడిన వర్మకు.. పార్టీలో త్యాగానికి తగిన గుర్తింపు లభించలేదు. అయినా అదే పిఠాపురం వర్మ.. బొండా ఉమా విమర్శలపై మిగిలిన నేతలంతా మౌనంగా ఉండిపోయిన వేళ.. మీడియా సమావేశం పెట్టి మరీ బోండా ఉమాకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
మోడీ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ కూడా జవాబుదారీ తనంగా చెప్పుకోవడం లేదు. ఇక దేశ యువత ప్రజా నిరసనలకు మోడీ సర్కార్ దిగి వచ్చిందని చెబుతున్నారు. అయతే ఒక్క వైసీపీ మాత్రమే బీజేపీ విషయంలో.. కాదు కాదు మోడీ విషయంలో రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తోంది.
బీజేపీకి ఆర్ఎస్ఎస్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక విధానపరమైన నిర్ణయాల వెనుకా ఆర్ఎస్ఎస్ ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. అయితే.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆర్ఎస్ఎస్ ఆసంతృప్తిగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఐదేళ్ల పాలనలో వైసీపీ నిర్వాకాన్ని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సభలో ఎండగడుతుందన్న భయంతోనే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు.
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.