కుప్పం ప్రజలకు భువనేశ్వరి భరోసా.!

Publish Date:Jul 30, 2026

Advertisement

రాష్ట్రంలో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది. గత నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కుప్పం. అయితే 2019 - 24 మధ్య కాలంలో చంద్రబాబు ప్రతిపక్ష  నేతగా ఉన్న సమయంలో అప్పటి  జగన్ ప్రభుత్వం.. కుప్పం నియోజకవర్గంలో పాగా వేసి 2024 ఎన్నికలలో విజయం కోసం వ్యూహాలు రచించింది. ఆ క్రమంలో స్థానిక ఎన్నికలలో తెలుగుదేం పార్టీ పరాజయం పాలయ్యేలా చేసింది. దీంతో అప్రమత్తమైన చంద్రబాబు అప్పట్లో కుప్పంపై ప్రత్యేక దృష్టి సారించి.. పరిస్థితిని చక్కదిద్దారు. 2024 ఎన్నికలలో కుప్పం నుంచే విజయం సాధించి పట్టు నిలుపుకున్నారు. 

ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్ర స్థాయి పాలనా వ్యవహారాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతుండటంతో.. కుప్పం బాధ్యతలను ఆయన అర్థాంగి   నారా భువనేశ్వరి భుజానికెత్తుకున్నారు. తరచుగా కుప్పంలో పర్యటిస్తూ.. నియోజకవర్గ అభివృద్ధి పనుల పర్యవేక్షణ, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడంతో పాటు నియోజకవర్గ ప్రజలతో నేరుగా మమేకమౌతున్నారు.  

కుప్పం తన తాజా   పర్యటనలో భాగంగా భువనేశ్వరి పలు సమావేశాల్లో మాట్లాడుతూ  అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జగన్ సర్కార్ తీరుపై విమర్శలు గుప్పించారు.  జగన్ హయాంలో  జరిగిన ఆర్థిక అక్రమాలు, నిధుల మళ్లింపు, ప్రాజెక్టుల పురోగతిని దెబ్బతీసిన విధానాలను ఆమె కుప్పం ప్రజల కళ్లకుకట్టినట్లు వివరించారు. జగన్ పాలనలో జరిగిన అక్రమాలను, అన్యాయాలను గుర్తుచేస్తూనే.. ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు.  

తెలుగుదేశం  కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సాధిస్తున్న అభివృద్ధిని స్పష్టంగా గణాంకాలతో సహా వివరించారు.  రాష్ట్రానికి  పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించడానికి ప్రభుత్వం తీసుకున్న, తీసుకుంటున్న చర్యలను వివరించారు  ముఖ్యమంత్రి సతీమణి స్వయంగా క్షేత్రస్థాయికి వచ్చి నియోజకవర్గ సమస్యలు, సంక్షేమ పథకాల అమలు తీరును పర్యవేక్షించడం స్థానిక ప్రజలలో, నాయకులలో  జోష్ ను నింపింది. 

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా యావత్ రాష్ట్ర ప్రగతి కోసం అలుపెరుగకుండా శ్రమిస్తూ.. నియోజకవర్గానికి క్రమం తప్పకుండా రాలేకపోయినప్పటికీ,   కుప్పం ప్రజల పట్ల తన బాధ్యతను నెరవేరుస్తున్నారనే భావన భువనేశ్వరి పర్యటనలతో స్థానికుల్లో బలంగా వ్యక్తమవుతోంది. భువనేశ్వరి చొరవతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొనడమే కాకుండా, స్థానిక సమస్యలను నేరుగా సీఎం దృష్టికి నేరుగా తీసుకెడుతున్నారని జనం భావిస్తున్నారు.  ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ ఆమె ముందుకు సాగుతున్న తీరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలలో సానుకూలత ఏర్పడేందుకు దోహదపడుతోంది.  

మొత్తానికి, కుప్పం నియోజకవర్గానికి తన భర్త అందిస్తున్న సుదీర్ఘ సేవలకు మద్దతుగా నారా భువనేశ్వరి తీసుకుంటున్న శ్రద్ధ, చూపిస్తున్న చొరవ రాబోయే రోజుల్లో కుప్పం రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనుందనడంలో సందేహం లేదు.   ప్రజలతో నేరుగా మమేకమవుతూ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేయడం ద్వారా కుప్పం ప్రజలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామనే స్పష్టమైన సంకేతాన్ని నారా కుటుంబం అందించింది.

Bhuvaneswari assures the people of Kuppam, Chandrababu Naidu Kuppam Constituency, TDP Kuppam,  Andhra Pradesh, TeluguOne News 

By
en-us Political News

  
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
కడప జిల్లా నుంచి జగన్ కుమార్తె హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం జరుగుతుదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే  సామాజిక మాధ్యమంలో, వైసీపీ శ్రేణుల్లో  హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అయితే హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ   వైసీపీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు.
అంబేడ్కర్ ఆశయాల సాధనకు తనతో కలిసి పనిచేయాలని  పిలుపునిచ్చారు. చురుకైన అంబేడ్కర్ వాదిగా గుర్తింపు పొందిన అభిజీత్ దీప్కే.. ఈ ఆఫర్‌ను స్వీకరిస్తారా లేదా అన్నది పక్కన పెడితే రామదాస్ అవధానే ఆహ్వానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  
 అసెంబ్లీలోనూ, మండలిలోనూ కూడా ఈ విషయంపై ఆయన మాట్లాడారు. సరే అసెంబ్లీలో వైసీపీ సభ్యులు లేరు, కానీ మండలిలో కూడా లోకేష్ డీఎస్సీపై మాట్లాడి, మండలిలో ప్రతపక్ష నేత బొత్స సత్యనారాయణ సంధించిన పలు ప్రశ్నలకు లోకేష్ సూటిగా, అంతే క్లారిటీగా సమాధానాలిచ్చారు.  
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా కుప్పంకు దగ్గరగానే ఉన్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా సంప్రదింపులు జరిపింది. ఏపీ సర్కార్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ నుంచి కుప్పం ఎయిర్ పోర్టుకు అవసరమైన షరతులతో కూడిన  నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ను విజయవంతంగా సాధించింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వైసీపీ.. ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. దీని వెనుక వైసీపీ 2029 ఎన్నికల వ్యూహం ఉందంటున్నారు పరిశీలకులు. కేవలం రాజకీయ విమర్శల విషయంలో వచ్చిన మార్పు కాదనీ, 2029 ఎన్నికల దిశగా వైసీపీ వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోందంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.