అయినా... జగన్ మారలేదు...

Publish Date:Aug 18, 2014

Advertisement

 

అయినా... జగన్ మారలేదు... ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మొదటి సమావేశాలు జరిగినప్పటి నుంచి తాజాగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరిగే మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ మీద ఒకటే ఆశ పెట్టుకున్నారు. అదేమిటంటే, ఈ రెండు అసెంబ్లీ సెషన్ల మధ్యకాలంలో ఆయనలో ఏదైనా మార్పు వస్తుందేమోననని!! కానీ ఆయనలో ఎంతమాత్రం మార్పు రాలేదు. నేనింతే అని తన పంథాలో తాను వెళ్తూనే వున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సమర్థ నాయకుడిగా తనను తాను నిరూపించుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. ఈ సమయంలో ఆయనకు నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం అవసరం ఎంతో వుంది. అలాంటి ప్రతిపక్షం పాత్రను వైసీపీ ధరిస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వుంది. అయితే జగన్ ప్రజల అభిప్రాయానికి ఎంతమాత్రం విలువ ఇవ్వకుండా తన రాజకీయ వ్యూహాలలో భాగంగా అధికార తెలుగుదేశం పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు.

ఏపీ అసెంబ్లీ మొదటి సమావేశాలను ఆయన ఇలాంటి విమర్శలతోనే వృధా చేశారు. తొలి సమావేశాలు జగన్ ఎలాగూ వృధా చేశారు. ఈ వర్షాకాల సమావేశాల నాటికి అయినా జగన్‌లో మార్పు వస్తుందని జనం భావించారు. ఆ సమావేశాలకు, ఈ సమావేశాలకు మధ్యకాలంలో జగన్ తనను తాను పరిశీలించుకుంటారని, ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని అర్థం చేసుకుని పాలక పక్షానికి సహకరిస్తారని ఆశించారు. అయితే జగన్ వారి ఆశలను వమ్ము చేసేశారు. సోమవారం ప్రారంభమైన ఏసీ అసెంబ్లీ సమావేశాలలో జగన్ పక్షం తన విశ్వరూపాన్ని మరోసారి చూపించడంతో అసెంబ్లీ ఎంతమాత్రం జరగకుండానే మంగళవారానికి వాయిదా పడింది. సోమవారం నాడు జగన్ కాస్తంత అయినా నిర్మాణాత్మకంగా వ్యవహరించి వుంటే అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద చక్కని చర్చ జరిగి మంచి పరిష్కార మార్గాలు అభించి వుండేవి. అయితే జగన్ ఆ అవకాశం ఇవ్వలేదు. తాను ఎంతమాత్రం మారలేదని జగన్ మరోసారి నిరూపించుకున్నారు. మంగళవారం నుంచి అయినా జగన్ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తే బాగుంటుంది.

By
en-us Political News

  
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
కడప జిల్లా నుంచి జగన్ కుమార్తె హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం జరుగుతుదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే  సామాజిక మాధ్యమంలో, వైసీపీ శ్రేణుల్లో  హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అయితే హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ   వైసీపీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు.
అంబేడ్కర్ ఆశయాల సాధనకు తనతో కలిసి పనిచేయాలని  పిలుపునిచ్చారు. చురుకైన అంబేడ్కర్ వాదిగా గుర్తింపు పొందిన అభిజీత్ దీప్కే.. ఈ ఆఫర్‌ను స్వీకరిస్తారా లేదా అన్నది పక్కన పెడితే రామదాస్ అవధానే ఆహ్వానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  
 అసెంబ్లీలోనూ, మండలిలోనూ కూడా ఈ విషయంపై ఆయన మాట్లాడారు. సరే అసెంబ్లీలో వైసీపీ సభ్యులు లేరు, కానీ మండలిలో కూడా లోకేష్ డీఎస్సీపై మాట్లాడి, మండలిలో ప్రతపక్ష నేత బొత్స సత్యనారాయణ సంధించిన పలు ప్రశ్నలకు లోకేష్ సూటిగా, అంతే క్లారిటీగా సమాధానాలిచ్చారు.  
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా కుప్పంకు దగ్గరగానే ఉన్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా సంప్రదింపులు జరిపింది. ఏపీ సర్కార్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ నుంచి కుప్పం ఎయిర్ పోర్టుకు అవసరమైన షరతులతో కూడిన  నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ను విజయవంతంగా సాధించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.