తుమ్మల వెనుక అదృశ్యహస్తం ఎవరిది?

Publish Date:Sep 2, 2014

Advertisement

 

చెరువు మీద అలిగిన సామెత చందాన తెలుగుదేశం పార్టీని విడిచిపెడతా... విడిచిపెడతా అని ఎప్పటి నుంచో బెదిరిస్తూ వచ్చిన ఖమ్మం జిల్లా తెలుగుదేశం నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు ఎట్టకేలకు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. తెలుగుదేశం అధినేతకు ఏకవాక్య రాజీనామా లేఖను రాసేసి, ఆ లేఖమీద సంతకం చేసే సమయంలో కన్నీరు కూడా పెట్టుకుని సెంటిమెంట్ సీన్ పండించారు. ఎన్టీఆర్ హయాం నుంచి తెలుగుదేశం పార్టీలో వున్న తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు ఖమ్మం జిల్లా టీడీపీలోని తన ప్రత్యర్థి నామా నాగేశ్వరరావును సాకుగా చూపించి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై కొట్టారు. ఇటీవల తుమ్మల అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆ సమయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో సహా పలువురు తెలుగుదేశం నాయకులు తుమ్మలను పరామర్శించారు. తమ సొంత మనిషి అనారోగ్యానికి గురయ్యారన్న సానుభూతిని ప్రదర్శించారు. అయితే ఆ సమయంలో తుమ్మల త్వరలో చేరబోయే పార్టీకి సంబంధించిన వారెవరూ పరామర్శించిన పాపాన పోలేదు. దీన్ని గమనించైనా తుమ్మల తెలుగుదేశం పార్టీని వీడరన్న అభిప్రాయాలు కలిగాయి. అయితే, తుమ్మల ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన మర్నాడు చేసిన ఘనకార్యం తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టడమే. తుమ్మల తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టడం పార్టీకి నష్టమా, ఆయనకే నష్టమా, పార్టీని విడిచినందుకు ఆయనకు లభించిన ‘హామీలు, తాయిలాలు’ వాస్తవరూపాన్ని ధరిస్తాయా, చివరకు చెవిలో పూలుగా మిగులుతాయా.... ఇలాంటి ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది. అయితే ఎంతో అనుబంధం వున్న తెలుగుదేశం పార్టీని తుమ్మల విడిచిపెట్టడం వెనుక వున్న అదృశ్యహస్తం గురించి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అధినేతగా వున్న ఒక వ్యక్తి అదృశ్య హస్తం తుమ్మల తెలుగుదేశం పార్టీ వీడటానికి కారణమైందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆ ‘మీడియా వ్యక్తి’ తుమ్మలకు సన్నిహితుడు. ఆయనగారు తుమ్మలకు తెలుగుదేశం పార్టీలో వున్న అసంతృప్తిని కనిపెట్టారు. అలాగే తెలంగాణలోని అధికార పార్టీకి ఖమ్మం జిల్లాలో బలమైన నాయకుడి అవసరాన్నీ గుర్తించారు. ప్రస్తుతం తెలంగాణలో తన మీడియా సంస్థకు సంబంధించి ఇబ్బందిని ఎదుర్కొంటున్న ఆయన ఒకే దెబ్బకు మూడు పిట్టలు పడేలా ఒక పథకం ఆలోచించారు. అది తుమ్మలను తెలుగుదేశం నుంచి బయటకి తీసుకొచ్చి తెలంగాణ పార్టీలో చేర్పించడం ద్వారా అటు తుమ్మలకు వున్న అసంతృప్తిని తొలగించడం, ఇటు తెలంగాణ పార్టీకి ఉన్న నాయకత్వ లోటుని తీర్చడం. ఈ ఉభయులకూ ఈ మేలు చేయడం ద్వారా తెలంగాణ ప్రాంతంలో తన మీడియాకి వున్న ఇబ్బందికర పరిస్థితులు తొలగిపోయేలా చేసుకోవడం. ఈ ప్లాన్‌తో పావులు కదిపి, సంప్రదింపులు జరిపిన ఆయన ఇప్పటి వరకు కొంతమేర సక్సెస్ అయ్యారు. కాకపోతే ఈ ఎపిసోడ్‌లో ట్విస్ట్ ఏమిటంటే, సదరు మీడియా వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా సన్నిహితుడు కావడం. అంటే, తన మీడియా సంస్థను కాపాడుకోవడం కోసం తన సన్నిహితుడి పార్టీకే చిల్లు పెట్టడానికి ఆవ్యక్తి పూనుకున్నాడన్నమాట. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాలవారు తుమ్మల పేరు చెబితే ఎంత కస్సుమంటున్నారో సదరు ‘మీడియా వ్యక్తి’ పేరు చెప్పినా అంతకంటే ఎక్కువ బుస్సుమంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికైనా ఆ వ్యక్తి అసలు స్వరూపాన్ని అర్థం చేసుకుని దూరంగా పెడితే మంచిదని భావిస్తున్నారు.

By
en-us Political News

  
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
కడప జిల్లా నుంచి జగన్ కుమార్తె హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం జరుగుతుదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే  సామాజిక మాధ్యమంలో, వైసీపీ శ్రేణుల్లో  హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అయితే హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ   వైసీపీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు.
అంబేడ్కర్ ఆశయాల సాధనకు తనతో కలిసి పనిచేయాలని  పిలుపునిచ్చారు. చురుకైన అంబేడ్కర్ వాదిగా గుర్తింపు పొందిన అభిజీత్ దీప్కే.. ఈ ఆఫర్‌ను స్వీకరిస్తారా లేదా అన్నది పక్కన పెడితే రామదాస్ అవధానే ఆహ్వానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  
 అసెంబ్లీలోనూ, మండలిలోనూ కూడా ఈ విషయంపై ఆయన మాట్లాడారు. సరే అసెంబ్లీలో వైసీపీ సభ్యులు లేరు, కానీ మండలిలో కూడా లోకేష్ డీఎస్సీపై మాట్లాడి, మండలిలో ప్రతపక్ష నేత బొత్స సత్యనారాయణ సంధించిన పలు ప్రశ్నలకు లోకేష్ సూటిగా, అంతే క్లారిటీగా సమాధానాలిచ్చారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.