బోజ్జిదొరకు పోలఫ్వరం శాపంగా మారుతుందా?

Publish Date:Apr 16, 2012

Advertisement

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థి పేరు ఖరారు అయ్యింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే బాడిస దుర్గారావు కుమారుడైన బాడిస బోజ్జిదొర పోటీ చేయబోతున్నారు. నిజానికి బోజ్జిదొర కలలో కూడా తనకు కాంగ్రెస్ టిక్కెట్ వస్తుదని ఊహించలేదు. అయితే ఈయన తండ్రి బాడిస దుర్గారావుకు పోలవరం నియోజకవర్గంలో ఓటర్ల సానుభూతి ఉంది. దుర్గారావు 1987 ఉప ఎన్నికల్లో, 1989 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోలవరం నుంచి గెలిచారు. అయితే 1994, 1999 ఎన్నికలో ఓడిపోయారు. 1999 ఎన్నికల్లో ఆయన కేవలం 24 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తరువాత ఆయన ఆర్థికంగా పూర్తిగా చితికిపోయారు.

కాంగ్రెస్ పార్టీ తనను రాజకీయంగా వాడుకుని వదిలేసిందని బతికి ఉండగా ఆయన పలుమార్లు వాపోయారు. కొంతకాలం ఆయన టిడిపిలో కూడా ఉన్నారు. దుర్గారావు అత్యంత దయనీయస్థితిలో మృతిచెందారు. ఈయన పట్ల పోలవరం ప్రజలకు సానుభూతి ఉండేది. దీన్ని దృష్టిలో ఉంచుకునే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వ్యూహాత్మకంగా ఆయన కుమారుడైన బోజ్జిదోరకు టిక్కెట్ ఇచ్చింది. నిజానికి బోజ్జిదోరకు ఈ టిక్కెట్టు అనూహ్యంగా లభించిన వరం లాంటిదే. అయితే ఈయనకు టిక్కెట్టు ఇవ్వటం పట్ల కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే అసంతృప్తి ప్రారంభమైంది. పలువురు నాయకులు బోజ్జిదొర అభ్యర్థిత్వాన్ని బహిరంగానే సవాల్ చేస్తున్నారు. దీంతో పార్టీలో ఉన్న అసంతృప్తి వచ్చే ఎన్నికల్లో బోజ్జిదొరకు శాపంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

By
en-us Political News

  
టూరిజం, ఎడ్యుకేషన్ రంగాల్లో సహకరించండి..!
నానక్‌రామ్‌గూడలోని భూ వివాదానికి సంబంధించి సినీ నటుడు అల్లు అర్జున్ మామ కే. చంద్రశేఖర్ రెడ్డి, మురళీ ధర్ రెడ్డి, గడ్డం రవి తదితరులపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.
ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించడమే ప్రధాన ఉద్దేశం..!
తెలుగు రాష్ట్రాల్లో పేదల సొంతింటి కల సాకారం..!
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో నేలకూలిన చెట్టు, ధ్వంసమైన వాహనాలు..!
నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌నగర్‌ చౌరస్తా సమీపంలో సోమవారం రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది.
సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించనున్న
తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో చోటుచేసుకున్న పసుపు నీళ్లతో శుద్ధి ఘటన ఇప్పుడు రాజకీయంగా చర్చనీ యాంశంగా మారింది.
వినాయక చవితి వేడుక లకు హైదరాబాద్‌ నగరం ముస్తాబవుతున్న వేళ.. బేగంబజార్‌లోని ఫీల్‌ఖానా ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలంగాణ రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి
వినాయక చవితి వచ్చిందంటే బాలాపూర్ పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన అసెంబ్లీ ముట్టడి లేదా నిరసనల ఉద్రిక్తతలకు సంబంధించి దర్యాప్తు వేగవంతమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.