Publish Date:Sep 14, 2026
వినాయక చవితి వేడుక లకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతున్న వేళ.. బేగంబజార్‌లోని ఫీల్‌ఖానా ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏకంగా మూడు న్నర కిలోల బంగారం, మూడు లక్షల వజ్రాలతో రూపొందించిన భారీ బంగారు విగ్రహాన్ని ఫీల్‌ఖానాలో ఏర్పాటు చేశారు.ఈ అద్భుతమైన విగ్రహం తయారీ కోసం ఎనిమిది నెలల పాటు 16 మంది కార్మికులు శ్రమిం చారు. ఎంతో నైపుణ్యంతో బంగారం, వజ్రాలను ఉపయోగించి రూపొం దించిన ఈ విగ్రహం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ప్రముఖ వ్యాపార, వాణిజ్య కేంద్రంగా పేరొందిన బేగంబజార్‌లోని ఫీల్‌ఖానాలో ఏర్పాటు చేసిన ఈ బంగారు-వజ్రాల విగ్రహం.. ఈ ఏడాది వినాయక చవితి వేడుకల్లో హైలెట్‌గా నిలవనుంది. విగ్రహాన్ని చూసేందుకు భక్తులు, నగరవాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది.మూడు న్నర కిలోల బంగారం.. మూడు లక్షల వజ్రాలు.. ఎనిమిది నెలల శ్రమ.. 16 మంది కళాకారుల నైపు ణ్యం.. ఇవన్నీ కలగలిసి రూపుదిద్దుకున్న ఈ ప్రత్యేక గణనాథుడు బేగంబజార్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
[ Ganesha with gold and diamonds in Begum Bazaar, Feelkhana, Vinayaka Chavithi 2026, Khairatabad Ganesh Puja, Telangana News, Ganesh Utsav Celebrations ]
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ganesha-with-gold-and-diamonds-in-begum-bazaar-24-231425.html
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది.
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.