తెలంగాణ విమోచన దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్..!

Publish Date:Sep 15, 2026

Advertisement

సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించనున్న ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ (హైదరాబాద్ ముక్తి దివస్) ఏర్పాట్లను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మంగళవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న కేంద్ర సాయుధ బలగాల కవాతు (పరేడ్) రిహార్సల్స్, సాంస్కృతిక ప్రదర్శనల సన్నాహాలను కిషన్ రెడ్డి వీక్షించారు. అనంతరం భద్రత, ట్రాఫిక్ మళ్లింపు, వీఐపీ ప్రొటోకాల్ తదితర అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 

 

ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 1947 ఆగస్టు 15న దేశమంతటా స్వాతంత్య్ర పండుగ చేసుకుంటుంటే, ఆనాడు నిజాం పాలనలోని హైదరాబాద్ సంస్థానంలో మాత్రం స్వాతంత్య్రం రాలేదని తెలిపారు. గ్రామగ్రామాన రజాకార్లు హిందువులపై దాడులు, దమనకాండ కొనసాగిస్తూ భయంకరమైన వాతావరణాన్ని సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆ దమనకాండ నుంచి తమను, తమ గ్రామాలను కాపాడుకోవడం కోసం ప్రజలే స్వయంగా బురుజులు, రక్షణ గోడలు నిర్మించుకుని నిలబడ్డారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఆనాటి రక్త చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు, గుర్తులు నేటికీ తెలంగాణ పల్లెల్లో సజీవంగా కనిపిస్తున్నాయని అన్నారు. 

ఇది ఏ ఒక్కరికో సంబంధించిన కార్యక్రమం కాదని, ఆనాడు నిజాం పెట్టిన బాధలను భరించి తెలంగాణ ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించిన సమరయోధులను స్మరించుకోవడం కోసమే భారత ప్రభుత్వం అధికారికంగా ‘హైదరాబాద్ ముక్తి దివస్’ను ప్రారంభించిందని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ గానీ, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ గానీ మజ్లిస్ పార్టీకి భయపడి అసెంబ్లీలో మాట్లాడిన మాటలను సైతం పక్కనపెట్టి, ఈ చారిత్రక దినోత్సవాన్ని నిర్వహించకుండా తప్పించుకున్నాయని కిషన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ముందుకు రాకపోవడంతోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారత ప్రభుత్వమే స్వయంగా బాధ్యత తీసుకుని ఈ ఉత్సవాలను నిరంతరాయంగా నిర్వహిస్తోందని చెప్పారు.

 

ఈ ఏడాది ఉత్సవాల్లో భాగంగా కేంద్ర సాయుధ దళాల విన్యాసాలతో పాటు, ప్రత్యేకంగా వేలాది మంది తెలంగాణ కళాకారులతో కూడిన ఆకర్షణీయమైన నాట్య ప్రదర్శనలు, సంప్రదాయ డప్పుల విన్యాసాలు ఉంటాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. చారిత్రక పోరాటాలను కళ్లకు కట్టేలా ఈ ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు.ఈ చారిత్రక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో పాటు పార్లమెంట్ సభ్యులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని వెల్లడించారు. తెలంగాణ పౌరుషాన్ని చాటిచెప్పే ఈ వేడుకల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈటల రాజేందర్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరగబోయే వేడుకల ఏర్పాట్లను కిషన్ రెడ్డితో కలిసి పరిశీలించిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఘనంగా జరుపుకోవాలని ఉద్యమ సమయంలోనే అనుకున్నామని తెలిపారు.

 

ఎవరి ఒత్తిడికి లొంగారో, ఏ అప్పీజ్మెంట్ పాలసీనో తెలియదు కానీ ఇక్కడ వేడుకలు జరపబడలేదని అన్నారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ స్టేట్ విముక్తి జరిగిందని, కర్ణాటక, మహారాష్ట్రలో వేడుకలు జరుపుకుంటున్నప్పటికీ తెలంగాణలో మాత్రం జరగడం లేదని పేర్కొన్నారు.ఇక్కడి ప్రభుత్వాలు రాజకీయాల కోసం, ఓట్ల కోసం కక్కుర్తి పడి జాతి ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టాయని ఈటల రాజేందర్ విమర్శించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని అనేక ఉద్యమాలు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని, ఈ క్రమంలో లాఠీ దెబ్బలు తిని రక్తాన్ని చిందించిందని అన్నారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవ బహుటాను, తెలంగాణ ప్రజల స్వతంత్ర దినోత్సవాన్ని, విముక్తి దినాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుందా మని, తెలంగాణ ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈటల రాజేందర్ కోరారు.

 

 

 

[ Telangana Liberation Day arrangements, TBJP, Secunderabad Parade Grounds, Union Minister G. Kishan Reddy,  MP Etala Rajender, Hyderabad State, CM Revanth reddy, Vice President C.P. Radhakrishnan, Gajendra Singh Shekhawat ]
 

By
en-us Political News

  
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో నేలకూలిన చెట్టు, ధ్వంసమైన వాహనాలు..!
నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌నగర్‌ చౌరస్తా సమీపంలో సోమవారం రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది.
తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో చోటుచేసుకున్న పసుపు నీళ్లతో శుద్ధి ఘటన ఇప్పుడు రాజకీయంగా చర్చనీ యాంశంగా మారింది.
వినాయక చవితి వేడుక లకు హైదరాబాద్‌ నగరం ముస్తాబవుతున్న వేళ.. బేగంబజార్‌లోని ఫీల్‌ఖానా ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలంగాణ రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి
వినాయక చవితి వచ్చిందంటే బాలాపూర్ పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన అసెంబ్లీ ముట్టడి లేదా నిరసనల ఉద్రిక్తతలకు సంబంధించి దర్యాప్తు వేగవంతమైంది.
పెళ్లయి తొమ్మిది నెలలే.. కొత్త జీవితంపై ఎన్నో ఆశలు.. అప్పటికే గర్భం దాల్చిన భార్య.. కానీ భర్త అనుమానం ఆ కుటుంబం లో విషాదాన్ని నింపింది.
భాగ్యనగరంలో వైభవంగా వినాయక చవితి సంబరాలు.. ఖైరతాబాద్‌లో తొలిపూజ పూర్తి..!
సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్‌లో మైనర్ బాలికపై పలువురు యువకులు మూడు రోజులపాటు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.
సికింద్రాబాద్ మౌలాలి సమీపంలో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుపై కరెంట్ తీగలు తెగిపడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది
కన్నుల పండువగా గణేశ్ ఉత్సవాలు.. ప్రత్యేక ఆకర్షణగా ఖైరతాబాద్ మహాగణపతి..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.