ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి పరీక్షగా మారిన పరకాల

Publish Date:May 15, 2012

Advertisement

వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గ ఉప ఎన్నిక మొత్తం ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి పరీక్షగా మారినట్లు కనిపిస్తోంది. పరకాల స్థానం విషయంలో బిజెపి, తెలంగాణా రాష్ట్ర సమితి నేతలు పోటీ పడటం, తెలంగాణా పొలిటికల్ జెఎసి ఈ విషయంలో ఎవరికీ నచ్చచెప్పలేకపోవడంతో పరకాలలో అంతా గందరగోళ పరిస్థితి నెలకొని వుంది.

 

 

దాంతో ప్రత్యేక తెలంగాణా నినాదంతో అటు బిజెపి, ఇటు తెలంగాణా రాష్ట్ర సమితి అభ్యర్థులు ఎన్నికల బరిలో వుంటారనిపిస్తోంది. వీరితోపాటు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ లో వుంటూనే ప్రత్యేక తెలంగాణాకు జైకొడుతున్న తాజా మాజీ సభ్యురాలు కొండా సురేఖ పోటీలో వుంటారు. ఈ స్థితిలో తెలంగాణా ఓటు చీలిపోతుందని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా తెలంగాణా నినాదంతో పాటే ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు కాకపోవడానికి టి.ఆర్.ఎస్. నేత చంద్రశేఖర్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మధ్య కుదిరిన ఒప్పందమే కారణమని, అదే విధంగా జగన్ తో కూడా కేసీఆర్ రహస్య ఒప్పందం వుందనే ప్రచార నేపథ్యంలో అనూహ్యంగా తెలుగుదేశంపార్టీ విజయం సాధించినా ఆశ్చర్యం లేదని భావిస్తున్నారు.

 

 

తెలుగుదేశం పార్టీ విజయం సాధించకపోయినా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచే కొండ సురేఖకు పరిస్థితి అనుకూలంగా మారే అవకాశం వుంటుంది. తెలంగాణా టి.ఆర్.ఎస్. అభ్యర్థి విజయం సాధించకుండా సురేఖ విజయం సాధించే పక్షంలో అందరూ అనుకుంటున్నట్టుగా జగన్, టి.ఆర్.ఎస్. నేత కెసిఆర్ మధ్య ఒప్పందం వున్నట్లు ప్రజలు విశ్వసించే అవకాశం వుంది. కాంగ్రెస్, తెలుగుదేశం, బిజెపి పార్టీలకు అనేక సిద్ధాంతాలు, లక్ష్యాలు వున్నాయి. కాని ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు అనే ఏకైక లక్ష్యంతో ఏర్పడిన పార్టీ టి.ఆర్.ఎస్. అందువల్ల ఆ పార్టీ కాకుండా ఇతరులు ఎవరు గెలిచినా ప్రత్యేక ఉద్యమం ప్రాధాన్యత తగ్గినట్టుగానే భావించాల్సి వస్తుంది.

By
en-us Political News

  
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో  దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.   
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది. 
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.