శశికళ జైలుకి... మరి ఆ రిసార్ట్ బిల్లు ఎవరికి?

Publish Date:Feb 14, 2017

Advertisement

మనకు తమిళ సినిమాలు కొత్త కాదు. బోలెడు డబ్బింగ్ అయ్యి ఇటు వస్తుంటాయి. ఏ మాత్రం బాగున్నామనం ఆదరిస్తూనే వుంటాం. శశికళ, పన్నీర్ ల మల్టీ స్టారర్ కూడా అలాంటి సక్సెస్ ఫుల్ తమిళ డబ్బింగ్ సినిమానే! కాకపోతే, ఈ సినిమాకి సుప్రీమ్ తీర్పు క్లైమాక్స్ అనుకున్నారు అంతా. కాని, శశి ఇంకా స్క్రీన్ ప్లే ఇంట్రస్టింగ్ గా నడిపిస్తోంది. తాను జైలుకి వెళ్లినా పళని స్వామీ రూపంలో తన మనిషినే పీఠం మీద కూర్చోబెట్టాలని ప్రయత్నిస్తోంది. ఎంత వరకూ సక్సెస్ అవుతుందో ఇప్పుడే చెప్పలేం. అలాగే పన్నీర్ కూడా ఊరికే ఏం వుండటం లేదు. తన లెక్కల్లో తాను మునిగిపోయాడు!

 


ఒకవైపు శశి, పన్నీర్ లు సీరియస్ గా పొలిటికల్ బ్యాటిల్లో తలపడుతుంటే సోషల్ మీడియాలో మాత్రం తెగ జోకులు షికారు చేస్తున్నాయి. అందులో, శశికళ శిక్ష ఖరారయ్యాక మొదలైన సెటైర్ '' ఇంతకీ ఇప్పుడు గోల్డెన్ బే రిసార్ట్ బిల్లు ఎవరు చెల్లిస్తారు? ''' అని! 

 


గోల్డెన్ బే అనే ఒక రిసార్ట్ వుందనే నిన్న మొన్నటి వరకూ ఎవరికీ తెలియదు. మహాబలిపురం వెళ్లే దారిలో అది వుందన్న సంగతి చిన్నమ్మ పుణ్యమా అని ప్రపంచం మొత్తానికి ఫ్రీగా తెలిసిపోయింది! ఆ రిసార్ట్ ఓనర్ ఎవరోగాని లక్కీ ఫెలో అనే అనాలి! ఇంత పబ్లిసిటీ కావాలంటే కోట్లు ఖర్చు చేయాలి యాడ్ప్ కోసం. కాని, చిన్నమ్మ తన ఎమ్మెల్యేల్ని తీసుకుపోయి గోల్డెన్ బేలో బంధించటంతో మీడియా మొత్తం గోల్డెన్ బే అంటూ గోల గోల చేసేసింది! సోషల్ మీడియాలో కూడా తమిళ ఎమ్మెల్యేల కొట్టంలా మారిన ఈ గోల్డెన్ బే ఫుల్ హాట్ టాపిక్ అయిపోయింది! 

 


ఫేస్బుక్, ట్విట్టర్లలో కొందరు నిన్న మొన్నటి దాకా ఓ జోక్ చేస్తూ వచ్చారు. తన వద్ద '' 130మంది ఎమ్మెల్యేలు వున్నారని... సీఎం అయ్యేందుకు గవర్నర్ తనని ఆహ్వానించాలనీ'' గోల్డెన్ బే ఓనర్ డిమాండ్ చేశాడంటూ వాళ్లు సెటైర్ వేశారు!  ఇక సుప్రీమ్ కోర్టు తీర్పు తరువాత శశికళ జైలుకి వెళ్లనుండటంతో ... ఇప్పుడు... ''గోల్డెన్ బే రిసార్ట్ ఓనర్ కి బిల్లు ఎవరు కడతారంటూ'' కామెంట్ చేస్తున్నారు! ఇన్ ఫ్యాక్ట్ బిల్లు ఎవరు చెల్లిస్తారో మనకు తెలియదు కాని... రిసార్ట్ లో చిన్నమ్మ తన ఎమ్మెల్యేలకు సకల సౌకర్యాలు కల్పించారు! బీరు, బిర్యానీతో పాటూ చిందులేసేందుకు మ్యూజిక్ కూడా పెట్టించారు! సో... బాగానే చమురు వదిలి వుంటుంది!

 


కొసమెరుపు ఏంటంటే... సోషల్ మీడియాలో... చాలా మంది మరో బాంబు పేల్చుతున్నారు! అసలు గోల్డెన్ బే రిసార్ట్ ఎవరిది? చిన్నమ్మ శశికళదే అంటున్నారు! అదే నిజమైతే బిల్లు బాధ లేదు... 

By
en-us Political News

  
రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి.. రాష్ట్రంలో మాత్రం వారిని ఒక రోజే, మహా అయితే రెండు రోజులకు మించి మకాం వేయరు. ఇలా వచ్చి అలా బెంగళూరు వెళ్లిపోతుంటారు.  
ఈ ఎన్నికల సంగ్రామంలో ఒకప్పుడు రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం వహించిన కాంగ్రెస్ పార్టీ  సోదిలోకి కూడా కనిపించకపోవడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ దయనీయ పరిస్థితిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మౌనంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో జగన్ కు తేరుకోలేని పరాభాం ఎదురైంది. వైనాట్ 175, వైనాట్ కుప్పం నినాదాలు మరుగున పడిపోయాయి. సొంత అడ్డా పులివెందులలో జగన్ మెజారిటీ గణనీయంగా తగ్గింది. కడప జిల్లాలోనూ పలు అసెంబ్లీ నియోజకవర్గాలు కూటమి వశమయ్యాయి. అలా   2024 ఎన్నికల్లో   జగన్ పార్టీ ఊహించని విధంగా ఘోర ఓటమిని చవిచూడటమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది.
గతంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన అమిత్ షా తన తాజా పర్యటనలో మాత్రం బీఆర్ఎస్ పై విమర్శల పదును తగ్గించారు. ఇందుకు కారణం తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా మారడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాజకీయ అవసరం కోసం తన సింగిల్ నినాదాన్ని మడిచి జేబులో పెట్టుకుని ఇండియా కూటమితో కలిసి నడవడానికి రెడీ అయిపోయారు.  జాతీయ స్థాయిలో వైసీపీ వైఖరి ఏమిటన్నది ఇప్పటి వరకూ బాహాటంగా స్పష్టత ఇవ్వని జగన్.. లోపాయికారీ మద్దతు మాత్రం మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికే ఇస్తూ వచ్చారు.
కాగా కేటీఆర్ మారిన ధోరణి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన మారారా? గతంలో తాను చేసిన విమర్శలు మరిచారా అన్న చర్చ జరుగుతోంది. ఏపీలో, జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేటీఆర్ జగన్ తో మైత్రి కంటే.. చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకీ దగ్గరవ్వడమే తెలంగాణలో బీఆర్ఎస్ కురాజకీయంగా ఒకింత మేలు జరుగుతుందన్నభావనతోనే కేటీఆర్ స్వరం మార్చారని పరిశీలకులు అంటున్నారు.  
పులివెందుల, కడప వంటి చోట్ల వైపీపీని ఎంత అధికార పార్టీ అయినా తెలుగుదేశం అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే అయినా ఏకగ్రీవం అన్న సాంకేతిక కారణాన్ని చూపి వైసీపీ అధికార దుర్వినియోగం ఆరోపణలు చేస్తోంది.
దర్యాప్తు సంస్థల నుంచి కేంద్ర ఎన్నికల సంఘంవరకూ అన్నిటిపైనా ప్రజా విశ్వాసం ఒకింత మసకబారింది. రాజ్యంగ సంస్థల విశ్వసనీయత దెబ్బతింది. పార్లమెంటు,  , ఎన్నికల సంఘం, కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు పట్ల ప్రజలలో అసహనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
తాజాగా స్థానిక ఎన్నికల వేళ  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తీరు, దూకుడు పట్ల పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.  పార్టీ   నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారానికి దోహదం చేస్తున్నాయి.  ముఖ్యంగా, జనసేన పార్టీకి చెందినవిగా చెప్పుకునే కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూటమి ఐక్యతను దెబ్బతీసే పోస్టులు కనిపించడం సంచలనం సృష్టిస్తోంది.  
ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 
ఇంతకీ స్థానిక ఏకగ్రీవాలపై ఆయన చేసిన హెచ్చరికలేంటని ఓ సారి చూస్తే..  స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించబోనని జగన్ స్పష్టమైన  హెచ్చరిక జారీ చేశారు.   ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ నిబంధనను స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు పార్టీ సీనియర్ నేతలకే  ఎసరుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.