యలమంచిలి రవి దారి ఎటు ...?

Publish Date:Apr 12, 2012

Advertisement

విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి రవి రాజకీయ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తనకు ప్రాధాన్యత లభించని కాంగ్రెస్ పార్టీలో కంటే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరితే బాగుంటుందనే ఆలోచనలో ఆయన వున్నట్లు తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో విజయవాడ నగరం పరిథిలోని మూడు అసెంబ్లీ స్థానాలకు గాను రెండు స్థానాల్లో ప్రజారాజ్యం పార్టీ, ఒక స్థానంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.

రవి ప్రజారాజ్యంపార్టీ తరపున కాంగ్రెస్ అభ్యర్థి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ), తెలుగుదేశంపార్తీ అభ్యర్థి గద్దె రామోహన్ లపై విజయం సాధించారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి వెల్లంపల్లి శ్రీనివాసరావులు, సెంట్రల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది విష్ణులు విజయం సాధించారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ప్రజారాజ్యం పార్టీకి చెందిన యలమంచిలి రవి, వెల్లంపల్లి శ్రీనివాస్ లు కూడా కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులుగా మారిపోయారు. విలీనం తర్వాత వెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీతో మమేకం అయినా యలమంచిలి రవి కాలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో తనకంటే తనపై ఓడిపోయినా మాజీ మంత్రి నెహ్రూకే ప్రాధాన్యత ఇవ్వడం, పార్టీపరమైన కార్యక్రమాల్లో కనీసం ఆహ్వానం కూడా లేకపోవడం రవికి అవమానకరంగా మారింది. నిజానికి రవికి ఎంతో గౌరవం లభించాల్సి వుంది. ఎందుకంటే కృష్ణాజిల్లా కమ్మ సామాజికవర్గం నుంచి వున్న ఏకైక శాసనసభ్యులు రవి.

కృష్ణాజిల్లా గత చరిత్రను పరిశీలిస్తే ప్రారంభం నుంచి కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీకానీ కమ్మసామాజిక వర్గానికి చెందినవారిదే పైచేయిగా వుండేది. ఈ పార్టీ అధికారంలో వున్న ఈ సామాజిక వర్గానికి చెందిన వారు మంత్రి పదవి పొందేవారు. కాని 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా ఈ పార్టీ తరపున జిల్లాలో ఒక్క శాసనసభ్యుడు కూడా ఎన్నికకాలేదు. దాంతో ఈ సామాజికవర్గం నుంచి ఎవరూ మాత్రి కాలేదు. బి.సి. వర్గానికి చెందిన పార్థసారధిని మంత్రిపదవి వరించింది. ప్రజారాజ్యంపార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆ పార్టీకి చెందిన యలమంచిలి రవి కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా మారిపోయాడు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరూ లేనందున తనకు ఎంతో ప్రాధాన్యత లభిస్తుందని రవి భావించారు.

కాని వాస్తవంలో అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ నాయకులు తనకు ప్రాధాన్యత ఇవ్వకుండా తనపై ఓడిపోయినా ప్రత్యర్థి నెహ్రూకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని అవమానకరంగా భావిస్తున్నారు. 2014లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీటు ఇస్తుందనే నమ్మకం కూడా లేదు. ఒకవేళ ఇచ్చినా ప్రతికూల పరిస్థితుల్లో విజయం సాధించడం అంత తేలికైన అంశం కాదు. ఈ నేపథ్యంలోనే రవి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీవైపు తనచూపు మరల్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వంగవీటి రాధాకృష్ణ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ వైపు ప్రయాణం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నందున ఆయనతోపాటు యలమంచిలి రవిని కూడా తమ పార్టీవైపు తిప్పుకోనేందుకు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేతలు గౌతమ్ రెడ్డి, జలీల్ ఖాన్ లు ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది.

By
en-us Political News

  
వినాయక విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు.  సంగారెడ్డి జిల్లా పరిధిలోని పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది.
వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులకు అదే చివరి ప్రయాణమైంది.
2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు.
విచారణ తర్వాత ఆ భూములని దళితులకు పంచుతాము..!
సినీ ప్రపంచాన్నే గడగడలాడించడమే కాకుండా పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ రవిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే.
టూరిజం, ఎడ్యుకేషన్ రంగాల్లో సహకరించండి..!
నానక్‌రామ్‌గూడలోని భూ వివాదానికి సంబంధించి సినీ నటుడు అల్లు అర్జున్ మామ కే. చంద్రశేఖర్ రెడ్డి, మురళీ ధర్ రెడ్డి, గడ్డం రవి తదితరులపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.
ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించడమే ప్రధాన ఉద్దేశం..!
తెలుగు రాష్ట్రాల్లో పేదల సొంతింటి కల సాకారం..!
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో నేలకూలిన చెట్టు, ధ్వంసమైన వాహనాలు..!
నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌నగర్‌ చౌరస్తా సమీపంలో సోమవారం రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.