నిజమైన పసుపు సైనికుడు పిఠాపురం వర్మ.!

Publish Date:Jul 28, 2026

Advertisement

తెలుగుదేశం పార్టీలో   విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా వ్యవహారం  కలకలం రేపుతున్న సంగతి విదితమే. . బోండా ఉమ వైసీపీ నేత అంబటి రాంబాబుతో వేదికను పంచుకోవడమే కాకుండా, పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు  ఇచ్చిన ఘాటైన సమాధానం  పార్టీ అధిష్టానానికి సవాలు విసురుతున్నట్లుగా మారింది. అధికారంలోకి వచ్చి ఇంకా సగం పదవీకాలం కూడా పూర్తి కాకముందే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ, అధినాయకత్వంపై  తిరుగుబాటు బావుటా ఎగురవేయడం సంచలనంగా మారింది.  

బోండా ఉమ త్వరలోనే వైసీపీ గూటికి చేరతారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అదలా ఉంటే..  బోండా ఉమ వైఖరి వల్ల పార్టీకి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి జరుగుతున్న నష్టాన్ని అడ్డుకుని బోండా ఉమా తీరును గట్టిగా ఖండిచి, విమర్శించాల్సిన తెలుగుదేశం కీలక నేతలు మౌనం వహించారు.  పార్టీలో  పదవులు అనుభవిస్తున్న వారు, భవిష్యత్తులో మంత్రి పదవులు లేదా ఉన్నత స్థానాలు ఆశిస్తున్న అగ్రనేతలు   బొండా ఉమా వ్యాఖ్యలపై స్పందించడం లేదు.  

అయితే.. పిఠాపురం వర్మ మాత్రం నిజమైన పసుపు సైనికుడిగా బోండా ఉమ తీరును గర్హించారు.   ఇటీవల పార్టీ అధిష్టానం తనను పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి నుంచి తొలగించింది. ఆ సమయంలో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పవన్ కల్యాణ్ కోసం గ2024 ఎన్నికలలో తన సీటును త్యాగం చేసి మరీ ఆయన విజయం కోసం పాటుపడిన వర్మకు.. పార్టీలో త్యాగానికి తగిన గుర్తింపు లభించలేదు. అయినా అదే పిఠాపురం వర్మ..  బొండా ఉమా విమర్శలపై మిగిలిన నేతలంతా మౌనంగా ఉండిపోయిన వేళ.. మీడియా సమావేశం పెట్టి మరీ బోండా ఉమాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. 

2019 ఎన్నికల్లో కాపు ఉద్యమం వల్లే టీడీడీపీ  ఓడిపోయిందన్న ఉమా వ్యాఖ్యలు సరికాదని స్పష్టం చేశారు.  జగన్ ఒక్క ఛాన్స్ పిలుపుతోనే ప్రజలకు ఆ పార్టీకి ఓటేశారని.. వ్యక్తిగత అభిప్రాయాలను  పార్టీకి అంటగట్టడం సరికాదని ఉమాకు హితవు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులకు పెద్ద పీట వేశారని.. రిజర్వేషన్ల అంశం, కాపు కార్పొరేషన్‌కు నిధులు కేటాయింపు, కాపు భవనాల నిర్మాణం, విదేశీ విద్య పథకం, స్వయం ఉపాధి వంటి  కార్యక్రమాలను అమలు చేసినది చంద్రబాబునని పిఠాపురం వర్మ పేర్కొన్నారు. 2014 ఎన్నికల సమయంలో కాపుల్ని బీసీల్లో చేరుస్తామని  ఇచ్చిన హామీ  మేరకు కమిటీని ఏర్పాటు చేసిన సంగతిని వర్మ గుర్తు చేశారు. 2019 నుంచి 2024 వరకూ అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కాపులకు చేసిందేమీ లేదని విమర్శించారు.  

కూటమి స్థిరత్వం కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం నాయకత్వం కొన్నిసార్లు క్షేత్రస్థాయి లాయలిస్టులను పక్కన పెట్టాల్సి రావచ్చు, కానీ నిజమైన శ్రేయోభిలాషి ఎవరు అనేది బయటపడేది సంక్షోభ సమయంలోనేననీ, ఆ విషయం వర్మ బోండా ఉమాకు ఇచ్చిన కౌంటర్ తో మరోసారి రుజువైందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

SVSN Varma, Pithapuram Varma, Chandrababu Naidu, Bonda Uma, TDP Political News 

By
en-us Political News

  
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం  వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.  
2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీ  రాష్ట్రంలో   రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి శతధా  ప్రయత్నిస్తోంది.  ఈ తరుణంలో ప్రజా సమస్యల ప్రాతిపదికన జరిగే  వామపక్షాలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం ఆ పార్టీకి రాజకీయంగా ఒకింత సానుకూలత వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
కేంద్ర పెద్దల కరుణా కటాక్షాల కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గత నెలలో హస్తిన వెళ్లి పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అది ఫలించ లేదు. కేంద్ర పెద్దల అప్పాయింట్ మెంట్ దొరకకపోవడంతో జగన్ హస్తిన పర్యటనకు వెళ్లలేదు.
ఇటీవలి కాలంలో మీడియాకు ముఖం చాటేయడమే కాకుండా, పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న సజ్జల తీరును వారు ఉదహరిస్తున్నారు.   ఇటీవలి కాలంలో సజ్జల సైలెన్స్ పార్టీ వర్గాలను సైతం విస్మయ పరుస్తున్నది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.