వంశీ బ్లాక్ మెయిల్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్!
Publish Date:May 15, 2012
Advertisement
విజయవాడ అర్బన్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు వల్లభనేని వంశీతో తనకు వ్యక్తిగతంగా ఎటువంటి బంధాలు, అనుబంధాలు లేవని సినీ హీరో నందమూరి తారక రామారావు (తారక్) ప్రకటించడం పట్ల తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు, ఆయన సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో హరికృష్ణ కూడా విజయవాడలో వంశీ చేసింది తప్పేననీ, పార్టీ పరంగా చర్యలు తీసుకోవటంలో తప్పులేదని వ్యాఖ్యానించడం ద్వారా వంశీ తొందరపడ్డాడని, రాజకీయంగా ఏకాకి అయినట్టు కనిపిస్తోంది. జగన్ తో తనకు సంబంధాలు వున్నట్టు తెలియచెప్పడం ద్వారా పార్టీని బ్లాక్ మెయిల్ చేయాలనే వంశీ తలంపు అట్టర్ ఫ్లాప్ అయింది. తారక్ తాను జీవించి వున్నంత వరకు తన తాత ప్రారంభించిన తెలుగు దేశం పార్టీతోనే తన అనుబంధం వుంటుందని, తాను రాజకీయాలలోకి వస్తానో లేదో కూడా చెప్పలేనని వివరించడం పార్టీ శ్రేణుల్లో ఊరట నిచ్చింది. విజయవాడలో వై.ఎస్.ఆర్. పార్టీ నేత జగన్ ను వంశీ పలుకరించడంతో పాటు ఆలింగనం చేసుకోవడం వెనుక రాజకీయ కారణాలు వున్నాయని, వంశీ ప్రవర్తనకు జూనియర్ ఎన్టీఆర్ మద్దతు కూడా వుందంటూ జరిగిన ప్రచారాన్ని జూనియర్ ఎన్టీఆర్ కహ్న్దించడంతోపాటు మరో అడుగు ముందుకువేసి వంశీ తనకు తెలిసినంత వరకు తనతో సినిమా తీసిన ఒక నిర్మాత మాత్రమేనని వ్యాఖ్యానించడం పట్ల తారక్ అభిమానులకు మరింత నమ్మకం కలిగించింది. పార్టీ శ్రేణుల్లో జూనియర్ ఎన్టీఆర్ పట్ల అభిమానం వున్నప్పటికీ తెలుగుదేశంపార్టీ కావాలా? జూనియర్ ఎన్టీఆర్ కావాలా అని అడిగితే పార్టీ కావాలనే చెప్పేవారు 99 శాతం మంది వున్నారు. ఈ అంశాన్ని గుర్తించడం వల్లనే జూనియర్ ఎన్టీఆర్, ఆయన తండ్రి హరికృష్ణ తెలుగుదేశంపార్టీ కి అనుకూలంగా ప్రకటన ఇవ్వడం అనివార్యమైందని కొంతమంది గుసగుసలాడుతున్నారు.
http://www.teluguone.com/news/content/vamshi-blackmail-plan-utter-flop-24-14038.html





