అమెరికా విదేశాంగ కార్యదర్శి భారత్ పర్యటన: ఎందుకో తెలిస్తే షాకే.!

Publish Date:Oct 19, 2026

Advertisement

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో,  ఇంధన రంగంలో  ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తన దేశ అవసరాల కోసం ఏయే దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకోవాలో భారత్‌ను నియంత్రించేందుకు ప్రయత్నిస్తూ, రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై వంద శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరిస్తూ వచ్చిన అమెరికా తీరులో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.  అమెరికా స్వయంగా తన దేశంలో తలెత్తిన   డీజిల్ సంక్షోభాన్ని అధిగమించడానికి భారత్ వైపు చూడాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత్‌లో పర్యటిస్తున్నారు.  

అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తన పర్యటనలో భాగంగా సాధారణంగా దౌత్య చర్చలు జరిగే న్యూఢిల్లీలో మాత్రమే కాకుండా,  ముంబై,  గుజరాత్‌లోని  జామ్‌నగర్ రిఫైనరీ ప్రాంతాలను కూడా చుట్టేస్తున్నారు.  నవంబరులో అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికల సమయానికి దేశంలో డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చే అవకాశాల నేపథ్యంలో..   ట్రంప్ సర్కర్ ను ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకే రూబియో ఈ అత్యవసర పర్యటన చేపట్టారు. భారత్ నుంచి భారీ ఎత్తున డీజిల్ ఇంధన సరఫరాను రుబియో ఈ పర్యటన చేపట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

గతంలో రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్న   భారత్‌పై ఆంక్షలు, వందశాతం సుంకాల బెదిరింపులకు దిగిన అగ్రరాజ్యం, నేడు తన సొంత అవసరాల కోసం అదే భారత్ సహకారాన్ని కోరుతోంది. అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్నట్లుగా అగ్రరాజ్యం తీరు ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచ ఇంధన మార్కెట్లో రిఫైనింగ్ సామర్థ్యంలో అగ్రగామిగా ఉన్న భారత్..  ఇప్పుడు అమెరికాకు ఆపద్బాంధవుడిగా మారుతున్న వైనం అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది.

అంతే కాకుండా ఏ దేశం నుంచైతే చమురు దిగుమతులు చేసుకుంటే వంద శాతం సుంకలు విధిస్తామంటూ భారత్ ను హెచ్చరించిందో, ఇప్పుడు అదే రష్యాతో కూడా అమెరికా ఒప్పందం కుదుర్చుకుని ఆ దేశంపై ఆంక్షలను ఉపసంహరించుకోవడం ద్వారా అగ్రరాజ్యం తన అవసరాల కోసం ఎంతకైనా దిగివస్తానని మరోసారి రుజువు చేసుకుంది.  స్వదేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు,  కొరతను నివారించడానికి ట్రంప్ సర్కార్ అత్యవసరంగా భారత్ రిఫైనరీల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకోవాల్సిన ఒత్తిడిలో ఉంది.

ఈ పరిణామాలు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొత్త మలుపు తిప్పుతున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, వాస్తవిక ఆర్థిక,  ఇంధన అవసరాలు అగ్రరాజ్యాన్ని అనివార్యంగా ప్రత్యమ్నాయ మార్గాల వైపు చూసేలా చేసిందంటున్నారు.  జామ్‌నగర్ వంటి అతిపెద్ద రిఫైనింగ్ కేంద్రాల ద్వారా అమెరికా తన ఇంధన భద్రతను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుండటం భారత వ్యూహాత్మక ప్రాధాన్యతను ప్రపంచానికి మరోసారి చాటిచెబుతోంది.  

[US Secretary of State Marco Rubio India Visit, Diesel Supply Crisis, America,  US Donald Trump, India US Energy Relations, Jamnagar Refinery, US Fuel Import, Telugu One]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.