ఇండియాపై అమెరికా టాక్స్ వార్?

Publish Date:Sep 16, 2026

Advertisement

రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు కొనసాగిస్తున్న దేశాలపై ఉక్కుపాదం మోపే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేగంగా అడుగులు వేస్తున్నారు. రష్యాతో వాణిజ్య సంబంధాలు నెరుపుతూ, భారీగా ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న భారత్ వంటి అగ్రగామి దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 100 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించడానికి వీలు కల్పించే బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభలో  ముందడుగు పడింది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న సంఘర్షణ నేపథ్యంలో రష్యా ఆర్ధిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకురావాలని ట్రంప్ భావిస్తున్నారు.

 లిండ్సే గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026' పేరుతో రూపొందించిన ఈ  బిల్లుకు  సంబంధించి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో  ఒక తీర్మానం ఆమోదం పొందింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 214 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 211 ఓట్లు వచ్చాయి. ఈ ఓటింగ్ ప్రక్రియలో కొందరు డెమొక్రాట్ తమ పార్టీ నిర్ణయానికి భిన్నంగా రిపబ్లికన్లతో కలిసి ఓటు వేయడం గమనార్హం. దీనితో అక్కడ ఊహించని పరిణామాలు చోటుచేసుకుని, ఈ బిల్లు తుది ఓటింగ్‌కు వెళ్లే మార్గం సుగమమైంది.

ఇప్పటికే ఈ బిల్లును అమెరికా సెనేట్ గతంలోనే 86-11 భారీ మెజారిటీతో ఆమోదించింది. ఇప్పుడు ప్రతినిధుల సభలో కూడా దీనిపై తుది ఓటింగ్ నిర్వహించనున్నారు. ఒకవేళ ఇక్కడ కూడా ఈ బిల్లుకు ఆమోదముద్ర పడితే, ఇది అమెరికా అధ్యక్షుడి సంతకంతో చట్ట రూపం దాలుస్తుంది.  ఈ చట్టం   అమల్లోకి వస్తే, రష్యా నుంచి అత్యధిక పరిమాణంలో చమురు, సహజవాయువును దిగుమతి చేసుకుంటున్న  దేశాల దిగుమతులపై 100 శాతం వరకు భారీ టారిఫ్‌లు విధించే విశేషాధికారం అమెరికా అధ్యక్షుడికి లభిస్తుంది.

ఈ బిల్లు ప్రధానంగా రష్యా నాయకత్వాన్ని, ఆ దేశ ఇంధన రంగాన్ని, రక్షణ శాఖను అలాగే పశ్చిమ దేశాల ఆంక్షలను తప్పించుకోవడానికి మాస్కో ఉపయోగిస్తున్న  షాడో ఫ్లీట్ నౌకల వలయాన్ని టార్గెట్ చేస్తోంది. అంతేకాకుండా, ఇరాన్‌పై ఇప్పటివరకు అమలులో ఉన్న ఆంక్షలను కూడా ఈ చట్టం మరింత పొడిగించనుంది. రష్యా ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయంతోనే ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తోందని, అందువల్ల ఆ దేశ ఇంధన వాణిజ్య భాగస్వాములైన భారత్, చైనా వంటి దేశాలపై ఆర్థిక ఒత్తిడి తేవడం ద్వారా యుద్ధాన్ని నిలువరించవచ్చని   బిల్లును సమర్ధిస్తున్నవారు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. 

అయితే..  ఈ బిల్లుపై అమెరికా రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధ్యక్ష పదవిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌కు ఎలాంటి కఠిన నిబంధనలు, అడ్డుకట్టలు లేకుండా ఇంత భారీ స్థాయిలో టారిఫ్‌లు విధించే అపరిమిత అధికారాలను కట్టబెట్టడం సరికాదని కొందరు డెమొక్రాట్ నేతలు  వ్యతిరేకిస్తున్నారు. ఈ విధమైన ఆర్థిక ఆంక్షలు భవిష్యత్తులో దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీయడమే కాకుండా..  అమెరికా వినియోగదారులపై కూడా  ధరల భారాన్ని మోపుతాయని   ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు, ఉక్రెయిన్‌కు అమెరికా ఇస్తున్న నిరంతర మద్దతును కొనసాగించాలని కోరుతూ దేశంలోని పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు కూడా ప్రస్తుతం వాషింగ్టన్‌లో ముమ్మర లాబీయింగ్ నిర్వహిస్తున్నాయి. దీనికి అనుగుణంగానే ఈ రష్యా వ్యతిరేక ఆంక్షల బిల్లుకు ఊతం లభిస్తోంది. అయితే.. రిపబ్లికన్ పార్టీలో కూడా ఉక్రెయిన్ వివాదంలో అమెరికా అనవసర జోక్యాన్ని వ్యతిరేకించే వర్గాలు ఉండటంతో, ఈ బిల్లుపై రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.

వచ్చే కొద్ది రోజుల్లో ప్రతినిధుల సభ సమావేశాలు విరామంలోకి వెళ్లనున్న నేపథ్యంలో.. ఈ బిల్లుకు సంబంధించి జరగబోయే తుది ఓటింగ్  ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే.. అది అంతర్జాతీయ వాణిజ్య రంగంలో, ముఖ్యంగా అమెరికా, భారత్ సహా ఇతర  దేశాల మధ్య ఆర్థిక సంబంధాలపై  ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రష్యా ఇంధన దిగుమతులపై అమెరికా తీసుకోబోయే ఈ నిర్ణయం ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో ఎలాంటి మలుపులకు దారితీస్తుందనే అంశంపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

[US sanctions bill, Russian oil imports, 100 percent tariffs on India, US House of Representatives, Donald Trump tariffs, Telugu One]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.