యురేనియం మైనింగ్ తో కడపజిల్లాకు ముప్పు
Publish Date:Apr 23, 2012
Advertisement
కడపజిల్లా తుమ్మలపల్లిలో కేంద్రప్రభుత్వం యురేనియం మైనింగు ప్రాజెక్టును ప్రారంభించింది. సుమారు 2,400 ఎకరాల్లో 1250 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. అయితే ఈ యురేనియం మైనింగు వల్ల కడపజిల్లాకు, ముఖ్యంగా తుమ్మలపల్లి పరిసర ప్రాంతాలకూ ముప్పు ఏర్పడుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే తుమ్మలపల్లి దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మంది ప్రజలు అనారోగ్యానికి గురై వలసలు వెళ్ళిపోతున్నారు. భూగర్భజలాలు అడుగంటడం పాత్రలకు చిల్లులు పడుతుండటం, గత రెండుళ్ళుగా తాగునీటి సమస్య తీవ్రతరం కావటంతో ఈ ప్రాంతాల్లో నివసించాటానికి ప్రజలు భయపడుతున్నారు. ఈ యురేనియం మైనింగు ప్రాజెక్టువల్ల ఈ ప్రాంతంలో రేడియేషన్ పెరిగే అవకాశాలున్నాయని, రేడియేషన్ స్థాయి పెరిగితే స్థానికులు కేన్సర్ వ్నటి ప్రమాదకర వ్యాథులకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/urenium-mining-project-in-cuddapah-district-24-13559.html





