ధర్మాన ఆపరేషన్ ఆకర్ష్

Publish Date:Apr 23, 2012

Advertisement

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట అసెంబ్లీ ఉప ఎన్నికలను జిల్లా మంత్రి ధర్మానప్రసాదరావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ధర్మాన తమ్ముడు కృష్ణదాసు పోటీ చేస్తుండగా, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున అన్నగారైన ధర్మాన రాందాసు పోటీ చేస్తున్నారు. పోటీ చేస్తున్నది అన్నగారైనా ఆయనను ఓడించటం తన కర్తవ్యమ్ అనే భావనతో ధర్మాన ప్రసాదరావు ఆపరేషన్ ఆకర్ష్ పేరిట తన వ్యూహ్యాన్ని అమలు చేస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగా నియోజకవర్గంలోని అర్హులకు వందలాది దీపం కనెక్షన్లు ఇప్పిస్తున్నారు. మహిళలకు విరివిగా రుణాలు మంజూరు చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా ఈ నియోజకవర్గానికి సుమారు 20 కోట్ల రూపాయలు మంజూరు చేయించారు.

 

 

 

ఈ నిధులతో ధర్మాన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్ట్టారు. మరోవైపు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేస్తున్న నాయకులకు గాలెం వేస్తున్నారు. టిడిపి ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చేవారం ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుడు చిరంజీవి పర్యటించే అవకాశం ఉండి. వచ్చే నెల మొదటివారంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారానికి రానున్నారు. మంత్రులు శ్రీధర్ బాబు, పార్థసారథి, విజయవాడ ఎంపి లగడపాటి ఇప్పటికే ఈ నియోజకవర్గంలో పర్యటించారు. ఉప ఎన్నికకు సంబంధించి తప్ప మరే విషయాలు తనకు చెప్పవద్దని మంత్రి ధర్మాన తన అనుచరులతో చెబుతున్నారంటే ఆయన ఈ ఎన్నికలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.

By
en-us Political News

  
 హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఎల్బీనగర్‌ హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
సింగరేణి కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
హైదరాబాద్ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన కౌకూర్ ఆర్చిడ్ విల్లాలో ఐదేళ్ల చిన్నారి ఆరిలియా హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి
హైదరాబాద్ నగరంలో క్రిప్టోకరెన్సీ లావాదేవీల నేపథ్యంలో తీవ్ర కలకలం రేపిన భారీ దోపిడీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఐదున్నర ఎకరాల స్థలం తమదేనంటూ ఓ వ్యక్తి, అతని కుమారుడు వచ్చి.. సి. రామచంద్రయ్య నుంచి అడ్వాన్స్ గా పాతిక లక్షలు తీసుకున్నారు. ఆ తరువాత పత్రాలు చూపించకుండా తప్పించుకున్నారు. సి.రామచంద్రయ్య ఫిర్యాదు మేరకు  ఆధారంగా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దేశానికి నిజంగా స్వరాజ్యం సిద్ధించిందా? అంటే అనుమానమే అనే సమాధానం వచ్చేలా ఉంది. కొన్ని చోట్ల ఇంకా కొనసాగుతున్న పెత్తందారీ వ్యవస్థ కారణంగా.  పేరుకే ప్రజాస్వామ్యం కానీ   చోట్ల అభివృద్ధి, సామాజిక ఐక్యత పేరుతో  కొన్ని ప్రాంతాలలో అనధికార కమిటీలు ప్రజలపై ఆంక్షలు విధిస్తున్నాయి. 
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలు శనివారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
తండ్రి అంటే పిల్లలకు ఒక భరోసా, కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. బయట ఎంతటి బిజీ రాజకీయ జీవితం గడిపినా, ఇంట్లో తమ వారి కోసం వారు చూపించే ప్రత్యేక శ్రద్ధ ఎంతో మధురమైనది.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో  ఇక వర్షాలు అంతంత మాత్రమేనని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. డిసెంబర్, జనవరిలలో శీతాకాలంలో చలి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందనీ, డిసెంబర్ నుంచే రోహిణిని తలపించే ఎండలు మండిపోతాయని అంచనా వేస్తున్నారు.
కన్నబిడ్డకు అనారోగ్యం వస్తే ఏ తల్లైనా తల్లడిల్లిపోతుంది. బిడ్డకు నయం చేయించేందుకు తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేయడానికైనా వెనుకాడదు.
ఇండియాలో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి  అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇదు అవుతుంది. అంటే ఇండియాలో ఏర్పాటు అవుతున్న అమెరికా యూనివర్సిటీ తెలంగాణకు తరలివచ్చిందన్న మాట.
తట్టి అన్నారం సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో కుక్కలు ఓ మృతదేహాన్ని పీక్కుతింటుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ దృశ్యం చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. చివరకు ఆమెను ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.