ఢీ విన్నర్ రాజు అరెస్ట్.. రూ.12 లక్షల వ్యవహారంలో కీలక మలుపు..!

Publish Date:Sep 13, 2026

Advertisement

బుల్లితెర డ్యాన్స్ షో ‘ఢీ’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్సర్ రాజు వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువతిని మోసం చేశాడన్న ఆరోపణలపై మియాపూర్ పోలీసులు రాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఈ కేసులో తాజాగా బాధితురాలి స్టేట్‌మెంట్‌ను కూడా పోలీసులు రికార్డు చేయడంతో దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది. పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. మియాపూర్‌లోని ఓ భవనంలో ఆమె బొటిక్ నిర్వహిస్తుండగా, అదే భవనంలోని డ్యాన్స్ స్టూడియోకు రాజు డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం తరచూ వచ్చేవాడని తెలుస్తోంది. 

ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి, ఆ పరిచయం ప్రేమగా మారిందని బాధితురాలు ఆరోపించింది. తనను పెళ్లి చేసుకుంటానని రాజు నమ్మించాడని, ఆ నమ్మకంతోనే అతడితో సన్నిహితంగా మెలిగానని ఆమె పోలీసులకు తెలిపింది. తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి రాజు డబ్బులు అడిగేవాడని, అతడి అవసరాల కోసం పలు విడతల్లో ఫోన్‌పే, నగదు రూపంలో సుమారు రూ.12 లక్షలు ఇచ్చినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పెళ్లి విషయం ప్రస్తావించిన ప్రతిసారీ రాజు ఏదో ఒక కారణం చెబుతూ తప్పించుకునేవాడని, చివరకు పెళ్లికి నిరాకరించడంతో తాను మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించినట్లు ఆమె ఆరోపించింది. 

బాధితురాలి ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు ఈ నెల 9న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం రాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది..రాజు అరెస్ట్‌తో ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసులు బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. రాజుతో తనకు ఏర్పడిన పరిచయం, పెళ్లి హామీ, డబ్బుల లావాదేవీలతో పాటు ఇతర అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. తనను మోసం చేసిన తర్వాత రాజు మరో సీరియల్ నటితో తిరుగుతున్నాడని బాధితురాలు ఆరోపించింది. 

అంతేకాకుండా రాజుపై కేసు పెట్టిన తర్వాత తనకు ఆ సీరియల్ నటి నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయని కూడా ఆమె ఆరోపించింది. రాజుపై తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది. తనకు జరిగిన అన్యాయంపై సినీ రంగంలోని పెద్దలు స్పందించి న్యాయం చేయాలని కోరుతోంది. ముఖ్యంగా సుమలత, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ తనకు అండగా నిలిచి న్యాయం చేయాలని బాధితురాలు విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పటికే అరెస్ట్, రిమాండ్ వరకు వెళ్లిన ఈ వ్యవహారంలో రూ.12 లక్షల లావాదేవీలు, పెళ్లి పేరుతో చేసినట్లు చెబుతున్న హామీ, మరో నటి నుంచి బెదిరింపులు ఎదురయ్యాయన్న ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

[ Dhee winner Raju Arest, Sumalatha, Shekhar Master, Johnny Master, Miyapur Police, Telugu Film Dancers Association, Telugu One, Telugu News]


 

By
en-us Political News

  
భాగ్యనగరంలో వైభవంగా వినాయక చవితి సంబరాలు.. ఖైరతాబాద్‌లో తొలిపూజ పూర్తి..!
సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్‌లో మైనర్ బాలికపై పలువురు యువకులు మూడు రోజులపాటు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.
సికింద్రాబాద్ మౌలాలి సమీపంలో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుపై కరెంట్ తీగలు తెగిపడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది
కన్నుల పండువగా గణేశ్ ఉత్సవాలు.. ప్రత్యేక ఆకర్షణగా ఖైరతాబాద్ మహాగణపతి..!
స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా మిగతా స్నేహితులంతా కలిసి అతని ఇంటికి వెళ్లి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు.
మైక్ కనిపిస్తే ఊగిపోతున్నారు.. నాయినిపై ఆగ్రహం..?
ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లోని ప్రసిద్ధ నాగోబా ఆలయ ప్రధాన పూజారి, మేస్రం వంశీయుల పెద్ద మేస్రం ఆనందరావు తెలంగాణ రక్షణ సేనలో చేరారు
సెల్‌ఫోన్‌లో చిన్న సమస్యను సరిచేయించుకునేందుకు బయటకు వెళ్లిన ఓ యువతి.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపో యింది.
ఆర్యవైశ్యులు సౌమ్యులు.. ఆత్మాభిమానం ఎక్కువగా ఉన్నవాళ్లని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
పండుగ పూట ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు తన ఎక్స్‌ వేదికగా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బేగంపేటలో ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి.. రుద్రారం వద్ద మృతదేహం..!
హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.