జీఎస్టీ విధానంలో మార్పులు.. వ్యాపారులపై పడే ప్రభావం ఏంటంటే.?

Publish Date:Oct 23, 2026

Advertisement

దేశంలో వ్యాపార నిర్వహణను మరింత  సరళం చేయడానికి మరియు పన్ను చెల్లింపుదారులకు ఇబ్బందులు లేకుండా చేయడానికీ కేంద్ర ప్రభుత్వం నడుంబిగించింది.  ఇందులో భాగంగా జీఎస్టీ  విధానాన్ని మరింత సరళతరం, సులభతరం చేయనుంది. ప్రధానంగా  చిన్న వ్యాపారాలు, ఈ కామర్స్ విక్రేతలు,  పన్నుచెల్లింపుదారులు దీర్ఘ కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పెట్టేలా నూతన సంస్కరణలకు కేంద్రం శ్రీకారం చుట్టింది.  

పన్ను చెల్లింపుల ప్రక్రియను పారదర్శకంగా మార్చడంతో పాటు, అనవసరమైన లీగల్ చిక్కులను తగ్గించడమే ఈ సంస్కరణల లక్ష్యంగా చెబుతోంది. ఈ కొత్త నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 9.5 లక్షల మంది చిన్న వ్యాపారులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. వివిధ రాష్ట్రాల్లో విడిగా భౌతిక కార్యాలయాలు లేదా గోదాములు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండా, ఈ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల వేర్‌హౌస్‌ల ద్వారానే జాతీయ మార్కెట్‌ను సులువుగా యాక్సెస్ చేసే సదుపాయం ఈ సంస్కరణల ద్వారా కలుగుతుంది. 

దీనివల్ల చిన్న వ్యాపారస్తుల పై పడే అదనపు పన్ను భారం భారీగా తగ్గుతుంది. అలాగే నెలకు రెండున్నర లక్షల రూపాయల వరకూ  ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) బదిలీ చేసుకునే వెసులుబాటు   లభిస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి జీఎస్టీ పోర్టల్‌లో యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లు, డ్రాప్, డౌన్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల తప్పుల తడకగా పేర్కొంటూ దరఖాస్తులు తిరస్కరణ గణనీయంగా తగ్గిపోతుంది. మరోవైపు, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ రిఫండ్‌లను ఎలాంటి ఆఫీసర్ జోక్యం లేకుండా పూర్తిగా ఆటోమేటెడ్ వ్యవస్థద్వారా వేగంగా మంజూరు అవుతుంది.

జీరో రేటెడ్ సప్లైస్,  ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ కింద క్లెయిమ్ చేసిన రిఫండ్ మొత్తంలో 90 శాతం నిధులను ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రొవిజినల్ పద్ధతిలో తక్షణమే విడుదల అవుతాయి. అలాగే అనవసరమైన వివాదాలను తగ్గించేందుకు షో కాజ్ నోటీసులు జారీ చేయడానికి  10 వేల కనీస పరిమితి  నిబంధన అందుబాటులోకి వస్తుంది. ఈ కీలక మార్పుల ద్వారా ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ వేగవంతం కావడంతో పాటు, వ్యాపార వర్గాల వర్కింగ్ క్యాపిటల్ సమస్యలు దాదాపుగా  పరిష్కారమవుతాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు.  


[Union Governmeny Gst Reforms, Central Government Gst, Ease Doing Business, Fast Gst Refunds, Telugu One]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.