Publish Date:May 31, 2012
తెలంగాణా రాస్త్ర సమితి పార్లమెంట్ సభ్యురాలు విజయశాంతి ఏ పని చేసినా వెనుకా ముందూ ఆలోచించదు. తనకు తోచిందే చేస్తానంటుంది. తెలంగాణా జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ పరకాలలో టి.ఆర్.ఎస్. అభ్యర్థికి మద్దతు ప్రకటించిన వెంటనే బిజెపిని పరకాల ఉప ఎన్నికల పోతీలోనుంచి తప్పుకోమని అల్టిమేటం జారీ చేసేసింది. అంతటితో ఆగిందా? ఇంకాస్త ముందుకు వెళ్ళి తెలంగాణా ఇస్తాం ... తెస్తామనే బిజెపికి చిత్తశుద్ధి ఉంటే టి.జె.ఎ.సి. నిర్ణయానికి మద్దతు ఇవ్వాలని పేర్కొంది. ఇంకో కొసమెరుపుగా టి.జె.ఎ.సి. మద్దతు ఇచ్చినందున టి.ఆర్.ఎస్. అభ్యర్థి మొలుగూరి భిక్షపతి గెలిచినట్లే అని ప్రకటించింది. దీంతో వెంటనే స్పందించిన బిజెపి తము కోదండరామ్ ప్రకటించిన అశాస్త్రీయమైన సర్వేలు నమ్మబోమనీ, ప్రత్యేక తెలంగాణాపై తాము అనేక సంవత్సరాల క్రితమే కాకినాడలో తీర్మానం చేసిన విషయం గతంలో బిజెపిలో ఉన్న విజయశాంతికే తెలుసునని ప్రకటించింది. కవ్వింపుచర్యల వల్ల ఉపయోగం లేదనీ, ఓటరు వేసే ఓట్లే విజయానికి ప్రాతిపదిక అని హితవు పలికింది. విజయశాంతి తన నోరును అదుపులో పెట్టుకోకపోతే పరకాలలో తమ కార్యకర్తలు ఆమెను అడుగడుగునా అడ్డుకుంటారని కమలనాథులు హెచ్చరిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trs-mp-vijayashanti-24-14500.html
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది.
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు.. అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.