Publish Date:May 31, 2012
పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా గురువారం భారత్ బంద్ కొనసాగుతోంది. అన్ని జిలాల్లలో ఆర్టీసి డిపోల ఎదుట తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. చాలాచోట్ల ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ యూపీఏ మిత్రపక్షం డీఎంకే తమిళనాడులో ఆందోళన చేపట్టింది. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఇందులో డీఎంకె అధ్యక్షుడు కరుణానిధి స్వయంగా ఆందోళనలో పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను తమ పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించదని.. పెట్రోల్ ధరలు తగ్గించకుంటే యూపిఎకు మద్దతు ఉపసంహరించేందుకుకూడా వెనకాడబోమని కరుణ హెచ్చరించారు. ఇప్పటికే తృణమూల్ అధినేత్రి మమత కూడా కోల్ కతాలో నిరసన ప్రదర్శన చేశారు. అటు.. కేంద్రమంత్రి ఏకే ఆంటోనీ కూడా వీరితో జతకలవడం విశేషం. పెట్రో ధరలు సామాన్యునిపై పెను భారాన్ని మోపాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అటు.. ఎన్డీయే, వామపక్షాలు తలపెట్టిన భారత్ బంద్ సందర్భంగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరుకాకపోతే జీతాల్లో కోత తప్పదని పశ్చిమ బెంగాల్‌లోని మమత బెనర్జీ సర్కారు హెచ్చరించింది. ఆ రోజున ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు మంజూరు చేసే ప్రసక్తే లేదని, ప్రత్యేక కారణాలేవీ చూపకుండా సెలవు పెట్టినా ఒప్పుకోబోమని మమత సర్కారు సర్క్యులర్ కూడా జారీచేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bharat-bandh-24-14496.html
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది.
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు.. అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.