జగన్ జైలుకు, రోజాలెగ్గుకు సంబంధం ఉందా?
Publish Date:May 31, 2012
Advertisement
ఉప ఎన్నికలు చిటపటలాడే విమర్శలతో వేడెక్కుతున్నాయి. ఉప ఎన్నికల గడువు దగ్గరపడే కొద్దీ విమర్శలకు నేతలు పదును పెడుతున్నారు.కొత్త కొత్త ఆరోపణలను సంధిస్తున్నారు. దీనికి తోడు తాజాగా జగన్ అరెస్టు కూడా విమర్శనాస్త్రాలకు ఓ అవకాశంగా ఉపయోగపడుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఘాటైన విమర్శలు చేయటం మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ వల్లే రాజశేఖరరెడ్డి వెలుగులోకి వచ్చారనీ, రాజశేఖరరెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ అవతరించాలేదని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీని వదిలేయాలనుకుంటే వెళ్ళిపోవచ్చు కానీ, కాంగ్రెస్ పార్టీని అంటే మాత్రం చూస్తూ ఊరుకోబోమని పీసీసీ ఛీఫ్ బొత్సా సత్యనారాయణ పరోక్షంగా ఎమ్మెల్యే ఆళ్ళ నానిని హెచ్చరించారు. అలానే తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ ఎవరు చేసిన నేరాలకు వారు కాక ఇంకెవరు శిక్ష అనుభవిస్తారంటూ జగన్ ను విమర్శించారు. వీరికి ఏ మాత్రం తీసిపోమని మహిళా నేతలూ రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ ఎంపి రేణుకా చౌదరి, గంగాభవానీ, తెలుగుదేశం పార్టీ తరుపున ఎమ్మెల్యే పరిటాల సునీత, సినీనటి కవిత, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ తరుపున వాసిరెడ్డి పద్మ, సినీనటి రోజా అక్కువగా ఈ బాణీలో తెరపై కనిపిస్తున్నారు. రోజాది ఐరెన్ లెగ్ ని, ఆమె ఎక్కడ కాలుమోపితే అక్కడ ఆ పార్టీ అట్టడుగు స్థాయికి చేరుతుందని, జగన్ కు ఈ గతి పట్టటానికి కూడా రోజా లెగ్ మహిమేనని, విజయమ్మకు రోజా పార్టీలో చేరినప్పటినుంచే కస్తాలు ప్రారంభమయ్యాయని, చంద్రబాబు పార్టీలో కొంతకాలం రోజా ఉందనీ, ఆ తరువాత తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయిందని కాంగ్రెస్ మహిలాధ్యక్షురాలు గంగాభవానీ ఆరోపించారు. అలానే రోజా కూడా కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీలు పన్నిన కుట్రవల్ల జగన్ కు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ మహానేత త్వరలోనే బయటకు వస్తారనీ, ఆయన్ని ఎవరూ ఏమీ చేయలేరని రోజా అంటున్నారు. ఇలా విమర్శనాస్త్రాలతో రాష్ట్రంలో ఉప ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది.
http://www.teluguone.com/news/content/actress-roja-ys-jagan-24-14501.html





