అందుకే కేసీఆర్ ఢిల్లీలో మకాం వేశారా?
Publish Date:Apr 11, 2012
Advertisement
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు తమ పార్టీని జాతీయ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకే ఢిల్లీలో మకాం వేశారా? అవుననే అంటున్నారు ఆ పార్టీకి చెందిన నేతలు. అందుకోసమే తమ పార్టీ చీఫ్ ఢిల్లీలో మకాంవేసి మంతనాలు జరుపుతున్నారంటూ టీఆర్ఎస్ శ్రేణలు చర్చించుకుంటున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్ ఆర్భవించిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఆ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆ పార్టీకి జై కొడుతున్నారు. ఎలాంటి ఎన్నికలు జరిగినా.. ఆ పార్టీ అభ్యర్థులనే భారీ మెజార్టీతో గెలిపిస్తూ.. తెలంగాణ వాదానికి మద్దతు తెలుపుతున్నారు.
ఈ నేపథ్యంలో.. తెలంగాణ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఆరు అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఐదింటిలో టీఆర్ఎస్, ఒక స్థానంలో భారతీయ జనతా పార్టీలకు చెందిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. దీంతో తెలంగాణ వాదం మరింత బలంగా ఉందని అన్ని రాజకీయ పార్టీలు విశ్వసిస్తున్నాయి. ఈ ఫలితాల అనంతరం ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. అక్కడే తిష్టవేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందులోభాగంగా ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి విలీన ప్రతిపాదనను పంపినట్టు సమాచారం.
http://www.teluguone.com/news/content/trs-24-13294.html





