మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పీక్స్ కు చేరాయి. ఒక వైపు శాంతి ప్రణాళిక, చర్చలు అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కాళ్ల బేరానికి వస్తూనే.. ఇరాన్ కు తీవ్ర స్థాయి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ తరుణంలో ఇరాన్ తన దాడులకు పదును పెట్టింది. కువైట్‌లోని అత్యంత కీలకమైన మీనా అల్-అహ్మది చమురు శుద్ధి కర్మాగారంపై ఇరాన్ డ్రోన్ దాడులకు తెగబడింది. శుక్రవారం ( ఏప్రిల్ 3) జరిగిన ఈ అనూహ్య దాడితో ఒక్కసారిగా గల్ఫ్ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు నేరుగా రిఫైనరీని తాకడంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ఈ ఘటనను అధికారికంగా ధృవీకరించింది. దాడి జరిగిన వెంటనే అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని వెల్లడిం చింది.
అయితే, ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన మీనా అల్-అహ్మదిపై ఇరాన్ దాడి . కువైట్ ఆర్థిక వ్యవస్థను గట్టి దెబ్బతీసిందనే చెప్పాలి. ఈ దాడుల నేపథ్యంలో కువైట్‌లోని చమురు బావుల నిర్వహణపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. శుద్ధి సామర్థ్యం తగ్గిపోతే బావుల నుంచి ఉత్పత్తిని నిలిపివేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. భారత్ సహా అనేక దేశాలు ఇక్కడి నుంచే ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటాయి. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తున్న భారత్, ముందస్తు జాగ్రత్తగా కువైట్ నుంచి చమురు దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేసింది.
ఇక ఇరాన్ దాడికి అమెరికా సైతం దీటుగా స్పందించింది. శాంతి వచనాలను పక్కన పెట్టి ఇరాన్ పై దుందుడుకు దాడులకు దిగనున్నట్లు హెచ్చించింది. అందులో భాగంగానే... తాజాగా అత్యంత శక్తివంతమైన ఎఫ్-15 యుద్ధ విమానంతో ఇరాన్ డ్రోన్ ను గగనతలంలోనే కూల్చివేసింది. సిరియా పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఈ డ్రోన్‌ను గుర్తించిన అమెరికా వైమానిక దళం, అప్రమత్తమై దానిని ధ్వంసం చేసింది.
కువైట్‌లోని కీలకమైన చమురు రిఫైనరీపై డ్రోన్ దాడి జరిగిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సిరియాలోని అల్-తన్ఫ్ బేస్ సమీపంలో డ్రోన్ ప్రవేశాన్ని పసిగట్టిన అమెరికా రాడార్ వ్యవస్థలు అప్రమత్తం చేయడంతో.. ఎఫ్-15 యుద్ధ విమానం గగనతలంలోనే ఆ డ్రోన్‌ను వెంబడించి నేలకూల్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tenssions-peak-in-middle-east-36-216624.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.