పీవోకేలో పాకిస్థాన్ వ్యతిరేక ఆందోళనలను ఉధృతం.!

Publish Date:Jul 6, 2026

Advertisement

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)  రగిలిపోతోంది. పాకిస్థాన్ అణచివేత చర్యలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళనలకు దిగుతున్నారు. పాకిస్థాన్ విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా లక్షల మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు.  జమ్మూకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) నేతృత్వంలో ఈ నెల 3న మొదలైన ఆందోళన, నిరసన ఇప్పుడు పతాక స్థాయికి చేరాయి.

 ముజఫరాబాద్, రావలకోట్, మీర్పూర్, దాద్యాల్, దేరకోట్ వంటి ప్రధాన నగరాలు అట్టుడుకుతున్నాయి. తమను బానిసలుగా చూస్తున్న  పాక్ ప్రభుత్వంపై జనం ఒకరకంగా తిరుగుబాటు చేశారు.  అయితే శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులపై పాకిస్థాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు..  టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు.  అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు.  మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.  

దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.  ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం.. ఉగ్రవాద నిరోధక చట్టం కింద జమ్మూకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ  నిషేధం విధించింది. ఆ సంస్థ నాయకులు, శ్రేణుల కోసం పీవోకే వ్యాప్తంగా పెద్ద ఎత్తున వేట మొదలెట్టింది.  ఇప్పటికే..  ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సీనియర్ లీడర్ షౌకత్ నవాజ్ మీర్‌తో పాటు 600 మందికి పైగా సామాజిక కార్యకర్తలు,   నాయకులను అరెస్ట్ చేసింది.  ఇక పీవోకే సమాచారం, ఆందోళనల వార్తలు బయటకు తెలియకుండా.. ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేసింది. 

పీఓకేలోని ప్రధాన పట్టణాలకు ఆహారం, పిండి, అత్యవసర మందుల సరఫరా నిలిపేసి..  ఆర్థిక దిగ్బంధాన్ని విధించారని స్థానిక నిరసనకారులు, సామాజిక కార్యకర్తలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆకలితో అలమటించేలా చేసి ఉద్యమాన్ని అణచాలని చూస్తున్న పాక్ పాలకుల ఎత్తుగడలను ప్రజలు తిప్పికొడుతున్నారని తెలిపారు. గతంలో కుదిరిన 38 అంశాల లిఖితపూర్వక ఒప్పందాన్ని తక్షణమే అమలు చేయాలని, అరెస్టయిన తమ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని, కాల్పుల్లో మరణించిన మహ్మద్ యాకూబ్ మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు తెగించి వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నారు.  

PoK protests against Pakistan, Pakistan occupied Kashmir unrest, PoK internet blackout, Shaukat Nawaz Mir arrest

By
en-us Political News

  
1972 లో అపోలో 17 మిషన్ ద్వారా  మానవుడు తొలి సారిగా చందమామపై అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన ఐదు దశాబ్దాల తరువాత.. నాసా  ఇప్పుడు కేవలం చందమామపై కాలుపెట్టి వచ్చేయడమే కాకుండా.. నెల నుంచి రెండె నెలల పాటు మనిషి అక్కడే నివసించడానికి వీలుగా ఒక పర్మనెంట్ బేస్ క్యాంప్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నది. 
ఇరాన్ లోకి   చొరబడే అమెరికా సైనికులను మట్టుబెట్టినా లేదా సజీవంగా బంధించి అప్పగించినా భారీ నగదు బహుమతి ఇస్తామంటూ పత్వా ప్రకటించింది. ఈ ఫత్వా సాక్షాత్తూ ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ  అఫీషియల్ గా ప్రకటించడం గమనార్హం.
శ్రావణ  సోమవారం నాడు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అభిషేకాలు జరిపించాలని సుదూర ప్రాంతాల నుండి భక్తులు ఆశోక్ ధామ్  క్షేత్రానికి పోటెత్తారు. ఆలయ ప్రాంగణమంతా హరహర మహాదేవ శంభో శంకర స్మరణలతో మార్మోగింది. రద్దీఅధికంగా ఉండటంతో ఒక్కసారిగా తొక్కిసలాట మొదలైంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలును మరింత వేగవంతం చేస్తూ, ములుగు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయూత పింఛన్ల పంపిణీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను నిత్యం సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటారు.
విజయవాడలో డీఎస్సీ టీచర్ల భారీ ర్యాలీ.. వైసీపీ ఆరోపణలపై ఆగ్రహం..!
సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలో పర్యటించారు.
యూపీ వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం ఊహించని భద్రతా ప్రమాదం జరిగింది.
భారత రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే వందేమాతరం గీతం మరోసారి తీవ్ర వివాదానికి దారితీసింది.
హైదరాబాద్‌లో కాలుష్య రహిత రవాణాను ప్రోత్సహించడంతో పాటు ఆటో రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
సినీ నటుడు, ప్రముఖ నిర్మాణ సంస్థ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత బండ్ల గణేశ్ ఇంట్లో కళ్యాణ శోభ సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర విమానయాన చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.