ట్రంప్, నెతాన్యాహూలను ఖతం చేయాలంటూ నినాదాలు.. ఎక్కడో తెలుసా?

Publish Date:Jul 5, 2026

Advertisement

అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహులను ఖతం చేయాలంటూ లక్షలమంది వీధుల్లో బహిరంగంగా నినాదాలు చేశారు. ఈ సంఘటన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ జరిగింది.  ఆయన అంత్యక్రియల సందర్భంగా లక్షల మంది జనం వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున అమెరికా, ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది.  అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో  ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే తీవ్ర ఉద్రిక్తతల కారణంగా వారి అంత్యక్రియలు వాయిదా పడుతూ వచ్చాయి. ఇరాన్ అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరిన తరువాత..  ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ఒక వారం రోజుల పాటు ఖమేనీ అంత్యక్రియల శవయాత్రను అత్యంత భారీ ఎత్తున నిర్వహించింది. టెహ్రాన్‌లోని  గ్రాండ్ మొసల్లా ప్రార్థనా మందిరం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో  లక్షలాది  ప్రజలు పాల్గొన్నారు. 

ఈ అంత్యక్రియల సభ  భారీ రాజకీయ ప్రదర్శనగా, ప్రతికార వేదికగా కనిపించింది.  ఇరాన్ జాతీయ జెండాలతో పాటు, ఇస్లామిక్ సంప్రదాయంలో  ప్రతికారానికి ప్రతీకగా భావించే ఎర్రజెండాలను పట్టుకుని లక్షలాది మంది జనం   అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహులను హతమార్చాలంటూ నినాదాలు చేశారు.  అంత్యక్రియల వేదికపై ప్రముఖ కవి మహ్మద్ రసూలీ మాట్లాడుతూ, ఇకపై కఫనమే మా వస్త్రమని, ట్రంప్‌ను మట్టుబెట్టడం తమ పవిత్ర బాధ్యత అని పిలుపుచ్చారు.   సాధారణ పౌరులు సైతం తమ ఇమామ్‌ను చంపిన ట్రంప్‌పై పగ తీర్చుకుంటామని బాహాటంగానే  చెబుతున్నారు. 

ఇజ్రాయెల్ నుంచి తీవ్రమైన ప్రాణాపాయ బెదిరింపులు ఉన్నప్పటికీ, భద్రతా ఆంక్షలను పక్కనబెట్టి ఇరాన్ అగ్రనేతలు, మిలిటరీ కమాండర్లు సుదీర్ఘ కాలం తర్వాత ఉమ్మడిగా బహిరంగంగా ప్రజల ముందుకు వచ్చారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాగెర్ ఖలీబాఫ్, శక్తివంతమైన కుద్స్ ఫోర్స్ అధిపతి ఇస్మాయిల్ ఖానీ, రివల్యూషనరీ గార్డ్స్ హెడ్ జనరల్ అహ్మద్ వాహిదీలతో పాటు ఖమేనీ కుమారులు మసౌద్, మేసమ్, ముస్తఫాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.   కాగా ఖమేనీ శవపేటికతో పాటు ఆ దాడిలో మరణించిన ఆయన కోడలు జహ్రా హద్దాద్ అడెల్, కేవలం 14 నెలల వయసున్న ఆయన మనవరాలు జహ్రా మొహమ్మది గొల్పాయిగాని శవపేటికలను  చూసి జనం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఖమేనీ పార్థివ దేహాన్ని ఇరాన్, ఇరాక్‌లోని ప్రముఖ నగరాల్లో ఊరేగించిన అనంతరం,  గురువారం   ఆయన స్వస్థలమైన మషాద్‌లోని పవిత్ర ఇమామ్ రెజా బలిపీఠం వద్ద ఖననం చేయనున్నారు.  

Teluguone, Ali Khamenei funeral, Iran revenge, Donald Trump, Benjamin Netanyahu, Tehran protests

By
en-us Political News

  
నీతి ఆయోగ్ ఈ ర్యాంకింగ్స్‌ను కేవలం ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా కాకుండా.. గత కొన్ని ఏళ్ల పారిశ్రామిక విధానాల ఆధారంగా లెక్కించింది. గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి విషయంలో జరిగిన గందరగోళం, పారిశ్రామిక విధానాల్లో స్థిరత్వం లేకపోవడం, గతంలో ప్రారంభమైన ప్రాజెక్టులను నిలిపివేయడం వంటి చర్యలు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశాయి. పక్క రాష్ట్రాల్లో లాగా పాలసీ కంటిన్యూటీ లేకపోవడం పెట్టుబడిదారుల్లో అపనమ్మకాన్ని కలిగించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
నడిరోడ్డుపై ఆమె దుస్తులు చించేసి, వివస్త్రను చేసి అవమానించారు. బాధితురాలు ఎంతగా వేడుకున్నా కనికరించకుండా పిడిగుద్దుల వర్షం కురిపించారు. స్థానిక మహిళలు అడ్డుకుని బాధితురాలికి దుస్తులు అందించారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తన భర్త పవన్ కల్యాణ్‌కు ఇటీవల భుజానికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని, స్వామివారి కృపాకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ అన్నా లెజినోవా కాలినడకన తిరుమల చేరుకుని తిరమలేశుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుమారుడు మార్క్ శంకర్ పవన్ కల్యాణ్ పేరిట అన్నప్రసాదం ట్రస్టుకు 17 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు.
వైసీపీ హయాంలో ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీ, తల్లిదండ్రులపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫోర్జరీ, అక్రమ వసూళ్ల ఆరోపణలతో అక్రమంగా కేసు నమోదు చేశారనేది ప్రధాన ఆరోపణ. వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా.. కేవలం 24 గంటల వ్యవధిలోనే ముంబై వెళ్లిన ఏపీ పోలీసులు ఆమెను, ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి విజయవాడకు తరలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ, వాటిని ఎండగట్టడమే ప్రధాన లక్ష్యంగా ఈ యువ సంగ్రామ సభకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది వేల మందికి పైగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు పార్టీ కార్యకర్తలు హాజరవుతారని బీఆర్ఎస్ అంచనా వేసింది.
రాజకీయ నాయకులు వస్తారు.. వెళ్తారు. పార్టీలు మారతాయి, జెండాలు మారతాయి, జనం, నేల మాత్రం శాశ్వతం. అందుకే.. అందుకే ఈ రోజు ప్రపంచాన్ని ఒకటే అడుగుతున్నాం. పులివెందులను ఒక వ్యక్తి కళ్లతో చూడకండి. పులివెందులను ఒక కుటుంబం చరిత్రతో కొలవకండి.
ఈ దాడుల్లో ప్రాంగణంలో పెంచుతున్నపాతిక గంజాయి మొక్కలు బయటపడ్డాయి. అంతేకాకుండా, విక్రయానికి సిద్ధంగా ఉంచినట్లు అనుమానిస్తున్న ఎండు గంజాయిని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు.
1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా పక్కన పెట్టడంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఆరున్నర దశాబ్దాల క్రితం క్రితం కుదిరిన ఈ ఒప్పందాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాలని, ఆధునీకరించాలని న్యూఢిల్లీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఒప్పందంలో మార్పులు జరిగే వరకు పాకిస్తాన్‌కు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్న ఇండియా.. తన సార్వభౌమత్వ పరిధిలోని పనులను వేగవంతం చేసింది.
ఆదివారం లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డేయే రోహిత్ శర్మ చివరి మ్యాచ్ అన్న ప్రచారానికి బలం చేకూర్చే విధంగా.. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు రోహిత్ శర్మ కుటుంబ సభ్యులు ఇప్పటికే లండన్ చేరుకున్నారు. దీంతో రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలు అయితే ఇది రోహిత్ శర్మ సొంత నిర్ణయమా? బిసిసిఐ పెద్దలు, చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాత్మకంగా పొమ్మనలేక పెడుతున్న పొగా అన్న అనుమానాలు క్రికెట్ అభిమానుల్లో బలంగా వ్యక్తమౌతున్నాయి.
రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీకి చెందిన ఆదివాసీలు ఈ సభలో పాల్గొన్నారు. ఈ ప్రాంతాల్లోని గిరిజన జిల్లాలను, సరిహద్దు గ్రామాలను అన్నింటినీ ఒకే చోటికి చేర్చి, ఒక సమగ్రమైన గిరిజన రాష్ట్రంగా మార్చాలని సభలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు.
చేనేత రంగానికి ప్రగడ కోటయ్య అందించిన సేవలను, చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఆయన చేసిన పోరాటాలను గుర్తించి.. రాబోయే తరాలకు ఆయన ఆశయాలను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొంది. ప్రగడ కోటయ్య జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో అధికారికంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై స్పష్టమైన ఆదేశాలు వెలువరించింది.
ఏపీలో తల్లికి వందనం పథకం కింద జూలై 22న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13,000 జమ కానున్నాయి. అంగన్వాడీ, శానిటేషన్ వర్కర్ల పిల్లలకు వర్తించే కొత్త రూల్స్, బడ్జెట్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
దేశంలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయనకు సంఘీభావం తెలపడానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వంటి ప్రముఖులు దీక్షా శిబిరానికి వచ్చి ఆయనను పరామర్శించారు. ఆయన పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూనే, ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం కాబట్టి దీక్షను విరమించాలని కోరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.