పాకిస్థాన్ లో అరాచకం ఏ స్థాయిలో ఉందంటే.. అక్కడ అన్యాయాన్ని, అరాచకాన్ని ఎదిరించడానికి ఏ చిన్న ప్రయత్నం చేసినా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ప్రభుత్వాధికారులైనా, సైన్యం, వాయుసేన అధికారులైనా జరుగుతున్న అక్రమాలను కళ్లప్పగించి చూస్తూ ఉండాల్సిందే. అలా కాదని ఆపడానికి ప్రయత్నిస్తే.. ప్రాణాలు హరీ మంటాయి. ఇందుకు తాజా ఉదాహరణే.. మహిళ కిడ్నాప్ యత్నాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ అధికారి హత్య.
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ నడిబొడ్డున, అదీ అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే హై-సెక్యూరిటీ వీఐపీ జోన్లో ఆదివారం (జులై 5)ఈ ఘోరం జరిగింది. జరిగిపోయింది. ఒక మహిళను కిడ్నాప్ నుంచి కాపాడాలని ఆ అధికారి చేసిన ప్రయత్నం ఆయన ప్రాణాలను తీసింది. పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ (పీఏఎఫ్) ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్‌లో అత్యున్నత బాధ్యతలు నిర్వర్తిస్తున్న గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ ఆదివారం (జులై 5)న షాహీన్ చౌక్ వద్ద ఒక మహిళ మోటార్ సైకిల్‌పై ఉన్న వ్యక్తితో తీవ్రంగా గొడవ పడటం ఆయన కంటపడింది. ఆ మహిళ రక్షణ కోసం ఆరాటపడుతోందని, తీవ్రమైన ఇబ్బందుల్లో ఉందని గ్రహించిన అసీమ్ తారిఖ్.. ఆ వ్యక్తి వద్దకు వెళ్లి నిలదీశారు. ఆ సమయంలో బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం మేరకు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి ఆమె కొలీగ్. ఆఫీస్ పని ముగిసిన తర్వాత అతడు లిఫ్ట్ ఇస్తానంటే నమ్మి బైక్ ఎక్కానని, కానీ అతడు నమ్మకద్రోహం చేసి, దారి మళ్లించి జనసంచారం లేని నిర్మానుష్య ప్రాంతం వైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడనీ.. . తనను కాపాడబోయి ఒక గొప్ప అధికారి ప్రాణాలు కోల్పోవడంపై దారుణమనీ ఆవేదన వ్యక్తం చేసింది. ఇస్లామాబాద్‌లోనే అత్యంత కట్టుదిట్టమైన ఆర్మీ వీఐపీ జోన్ పరిధిలో ఈ ఘోరం జరగడం పాక్ రక్షణ వ్యవస్థ డొల్ల తనాన్నీ, ఆ దేశంలో అరాచక శక్తుల ఆగడాలనూ తేట తెల్లం చేస్తోంది.
Asim Tariq shot dead, Islamabad VIP zone shooting, woman kidnapping foil Pakistan, Shaheen Chowk incident
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pak-air-force-officer-shot-dead-36-225139.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ (కన్నేపల్లి) పంప్ హౌస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.