తెలంగాణలో ‘కౌరవ సభ’.. అసెంబ్లీలో రగడకు అసలు కారణమేంటి..?

Publish Date:Sep 12, 2026

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు.. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పెరుగుతున్న దూకుడు.. అసెంబ్లీ వేదికగా సాగుతున్న మాటల యుద్ధంపై టోన్ న్యూస్  ప్రత్యేక చర్చ జరిగింది. రాజకీయ విమర్శలు క్రమంగా వ్యక్తిగత దూషణల స్థాయికి చేరుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్‌, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి మధ్య కొనసాగుతున్న రాజకీయ విమర్శలు, పరస్పర ఆరోపణలు చర్చకు వచ్చాయి. అదే సమయంలో కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడం కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

గతంలో అసెంబ్లీ చర్చలు ఎలా ఉండేవి.. ప్రస్తుతం పరిస్థితులు ఎలా మారిపోయాయన్న అంశంపైనా విశ్లేషణ జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, జైపాల్‌రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య వంటి నేతల హయాంలో శాసనసభ చర్చలు ప్రధానంగా విధానాలు, ప్రజా సమస్యలు, అంశాల ఆధారంగా సాగేవని గుర్తుచేశారు. భాషలో సంస్కారం, చర్చల్లో హుందాతనం కనిపించేవని పేర్కొన్నారు.

అయితే ప్రస్తుతం రాజకీయ నేతల మధ్య వ్యక్తిగత విమర్శలు, పరస్పర దూషణలు పెరిగిపోతున్నాయని విశ్లేషించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన శాసనసభలోనే రాజకీయ రగడకు ప్రాధాన్యత పెరగడం ఆందోళన కలిగించే పరిణామమన్న అభిప్రాయం వ్యక్తమైంది.

అంతేకాదు.. అసెంబ్లీ వేదికగా చర్చించాల్సిన అంశాల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు వీధుల్లోకి వచ్చి పోరాటాలకు సిద్ధమవడం కూడా చర్చకు వచ్చింది. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజమే అయినా.. వాటిని శాసనసభలోనే చర్చించి పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో మారుతున్న భాష, పెరుగుతున్న అగ్రెసివ్‌ పాలిటిక్స్‌.. అసెంబ్లీ చర్చల తీరుపై ఆసక్తికరమైన విశ్లేషణ జరిగింది.

 

 

 

 

[ Telangana Politics, Telangana Assembly, KCR, Revanth Reddy, Telangana Assembly Ruckus, KCR vs Revanth Reddy, Telangana Political Crisis, Assembly Debate, Telangana Political War, Telangana Politics ]

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో  దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.   
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది. 
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.